Advertisement
Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు… మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
Advertisement
Today Horoscope Telugu 2023: ఈ రోజు రాశి ఫలాలు 17.01.2023
మేషం :- ఆర్థిక వ్యవహారాలు అభివృద్ధి దిశగా నడుస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల సౌఖ్యం ఉండును. పది మందిని కూడకట్టుకొని ఓ మంచి పనికి శ్రీకారం చుడతారు. రాజకీయ, కళారంగాల వారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు రాగలవు.
Rashi Phalalu in Telugu 2023
వృషభం :- వ్యాపారమునందు రావలసిన బాకీలు వచ్చును. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మాట పడవలసి వస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.
మిథునం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూలు చేస్తారు. విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలించవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం అధికమవుతాయి.
కర్కాటకం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులకు ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. శత్రువుపై విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. బ్యాంకు వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది.
సింహం :- ఆదాయంలో మార్పులు కానవస్తాయి. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊపిరి పీల్చుకుంటారు. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారడం విశేషం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
కన్య :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. వ్యాపారులకు మంచి లాభం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖుల కలయికతో జ్ఞాపకాలు కలబోసుకుంటారు. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగనైనా అందుతుంది.
Advertisement
తుల :- సహోద్యోగులతో సమావేశాల్లో పాల్గోంటారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారు. ఓ వార్త కలవరపెడుతుంది. కళల పట్ల ఆశక్తి పెరుగుతుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు పడతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
వృశ్చికం :- గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కొబ్బరి, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాల వారికి సంతృప్తి నిస్తుంది. ధనం ఎంత వస్తున్న ఏమాత్రం నిలువ చేయలేక పోవుట వలన ఆందోళనకు గురిఅవుతారు. పండితులకు ప్రోత్సాహం లభిస్తుంది.
ధనస్సు :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్నిపొగిడే వారే కానీ సహకరించే వారుండరు. సోదరీ, సోదరులతో మెళకువ వహించండి.
మకరం :- స్త్రీలకు పుట్టింటి మీద మమకారం పెరుగుతుంది. ఒక్కోసారి పెద్దలు వేదాంత ధోరణి కనబరుస్తారు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు వాయిదా పడగలవు. ఏ వ్యక్తిపై పూర్తిగా ఆధారపడటం మంచిది కాదని గమనించండి. విద్యార్థులకు పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ఊహించని సంఘటనలెదురవుతాయి.
కుంభం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. ప్రతి పనిలోనూ ఏకాగ్రత వహించుటవలన జయం. మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. రిప్రజెంటివ్‌ల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కొంత మంది సూటిపోటి మాటలు పడటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు.
రాశిచక్ర అంచనాలు
మీనం
మీనం :- ఆర్థిక విషయాలలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. ఉపాధ్యాయులకు విధి నిర్వహణలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. మీ నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. మీ సంతానం విషయంలో ఏకాగ్రత వహించగలుగుతారు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?