Advertisement
ఇవాళ అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశిని వరిస్తుంది. వారి గ్రహస్థానాల మధ్య ఈరోజు రాసి చక్రంలోని 12 రాజుల వారికి ఇలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయో, మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో, ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Advertisement
మేషం:
మిశ్రమ వాతావరణం కలదు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎలాంటి పరిస్థితులలోను మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడతారు. దైవారాధన మానవద్దు.
వృషభం:
మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివ ఆరాధన మంచి చేస్తుంది.
మిధునం:
చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటలకు దూరంగా ఉండటమే మంచిది. శని శ్లోకాన్ని చదవండి.
కర్కాటకం:
చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇస్తులతో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.
సింహం :- స్త్రీలకు పనిభారం అధికం. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. దైవ కార్యాలపట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రముఖుల పరిచయాలతో మీ పలుకుబడి పెరుగుతుంది. మిమ్ములను ఆందోళనకు గురిచేసిన సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి.
కన్య :- సౌమ్యంగా మెలిగి గృహ ప్రశాంతతను కాపాడుకోవాలి. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. రాబడికి మించి ఖర్చులుంటాయి, దుబారా ఖర్చులు నివారణ సాధ్యం కాదు. మీ శ్రీమతితో అభిప్రాయభేదాలు, కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది.
Advertisement
తుల :- ఈ ఇబ్బందులు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. త్వరలో కొన్ని సమస్య నుంచిబయట పడతారు. ఉద్యోగస్తులకు అతికష్టంమ్మీద సెలవు మంజూరవుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిశ్చింతకు లోనవుతారు.
వృశ్చికం :- పత్రికా,వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు తీర్పులు మీకే అనుకూలం. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిమ్ములను కలవరపరిచిన ఒక సమస్య అతి సునాయాసంగా పరిష్కారమవుతుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది.
ధనస్సు :- నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ మంచిది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్థాపం కలిగిస్తాయి. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
మకరం :- ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూలత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. కొన్ని అనుకోని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు అధికం. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. స్త్రీలకు మోకాళ్ల నొప్పులు, దంత బాధలు ఎదుర్కోవలసి వస్తుంది.
మీనం :- వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి, పాత బకాయిలు వసూలుకాగలవు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వాయిదా వేసిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు.
Read Also : రీమేక్ సినిమాలు ఎక్కువగా తీసిన టాలీవుడ్ హీరోలు?