Advertisement
జూలై 22వ తేదీ అంటే శుక్ర వారం నాడు చంద్రుడు వృషభ రాశి నుంచి వృశ్చికంలో ప్రవేశించనున్నాడు. ఈ రోజున గురుడు వృశ్చికం నుంచి చంద్రుడి రాశి అయిన కర్కాటకంలో కి ప్రదర్శిస్తున్నాడు. ఈ రెండు శుభగ్రహాల మార్పుతో పాటు చంద్రుడు అలాగే గురు శిష్యుల యోగాన్ని సృష్టించడం వల్ల ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేషం నుండి మీనం వరకు నేటి దిన ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మేషం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేకపోతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
READ ALSO : రైల్వే స్టేషన్లను “జంక్షన్” అని మరికొన్నిటిని “సెంట్రల్”, “టెర్మినస్” అని ఎందుకు పిలుస్తారు?
వృషభం :- దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగుల నిర్లిప్త ధోరణి వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. అధికారులకు బహుమతులు అందజేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
మిథునం :- స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఒక విచిత్ర కల మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. దూర ప్రయాణాలలో బంధువులను కలుసుకుంటారు. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆహార వ్యవహారాలో మెలకువ వహించండి.
కర్కాటకం :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదని గ్రహించండి. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది.
సింహం :- కుటుంబ అవసరాలు పెరగటంతో ఇబ్బందు లెదుర్కుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. గృహంలో మార్పులు, చేర్పులు మరి కొంతకాలం వాయిదా వేయటం మంచిది.
Advertisement
కన్య :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
తుల :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, కీలక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రుణాలు తీరుస్తారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులు లెదురవుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం :- ఉద్యోగస్తులు అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలకు ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.
ధనస్సు :- ఉద్యోగస్తులు తరుచు యూనియన్ కార్యకలాపాల్లో నిమగ్నులై ఉంటారు. ఎక్కువగా శ్రమించన కొద్ది ఫలితాలు ఉంటాయి. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో గృహంలో ప్రశాంతత, సౌఖ్యం నెలకొంటాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది.
మకరం :- రాజకీయ నాయకులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పోగొట్టుకున్న అవకాశం, పత్రాలు తిరిగి పొందుతారు. ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇవ్వడంవల్ల ఇబ్బందులకు గురికావలసి వస్తుంది.
కుంభం :- ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. ప్రేమికులకు పెద్దలకు మధ్య సమస్యలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్య, ఆహార విషయంలో మెళుకువ చాలా అవసరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
మీనం :- రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. బంధువులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఇబ్బందులు తప్పవు. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు.
READ ALSO : ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి?