Advertisement
నటి రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఈమె అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం రష్మిక పుష్ప టు సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 5న పుష్ప మూవీ రిలీజ్ అవ్వబోతోంది. చెన్నైలో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరిపారు. అక్కడకు వచ్చిన రష్మిక అందర్నీ ఆకట్టుకున్నారు. ఆమె అక్కడ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు.
Advertisement
ఎప్పటి నుంచో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారని వార్తలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ వెకేషన్ లకి వెళ్ళిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా రష్మిక చెప్పిన సమాధానం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈమె సమాధానం చెప్తుంటే ఆడిటోరియంలో ఉన్న శ్రీలీల గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.
Also read:
Advertisement
Question : Would you marry someone from the film industry or not?#RashmikaMandanna : "EVERYONE KNOWS ABOUT IT…!!" #VijayDevarakonda
pic.twitter.com/I7FhV75f0K https://t.co/4tfuOtK316— Bharat Media (@BharatMediaNow) November 24, 2024
Also read:
అల్లు అర్జున్ అయితే కాస్త సిగ్గు పడినట్లు కనపడింది. పెళ్లి ఎవరిని చేసుకుంటారు అన్న ప్రశ్నకు రష్మిక మీ అందరికీ తెలిసిందే అని చెప్పారు. అయితే దీన్ని బట్టి ఆమె విజయ్ దేవరకొండ ని పక్కా పెళ్లి చేసుకుంటారని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రష్మిక విజయ దేవరకొండ ఏడడుగులు వేస్తారో లేదో చూడాలి.