Advertisement
రతన్ టాటా ముంబైలోని బ్రిటిష్ రాజ్ కాలంలో పారసీ జొరాష్ట్రియన్ ఫ్యామిలీలో 28 డిసెంబర్ 1937 లో పుట్టారు. 1991లో 100 బిలియన్ల డాలర్ల స్టీల్ టు సాఫ్ట్వేర్ సమ్మేళనానికి చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజలు నివాళులు అర్పించేందుకు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్డ్స్ లో ఉంచినట్లు టాటా బంధువులు తెలిపారు.
Advertisement
ఆయన పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే జీవించారు. నాలుగు సార్లు పెళ్లి చేసుకునే అవకాశం వచ్చి జారిపోయింది. ఆయన మాజీ ప్రియురాలు సిమి గేరేవాల్ ఎక్స్ వేదికగా సంతాపాన్ని తెలిపారు. మీరు వెళ్లిపోయారని వారు అంటున్నారు. మీ నష్టాన్ని భరించడం కష్టం. చాలా కష్టం. వీడ్కోలు నా మిత్రమా టాటా అని భారత దేశపు రతన్ స్వర్గనివాసానికి బయలుదేరే ముందు అందరికీ టాటా అంటాడు అని ఫోటోతో ట్వీట్ చేశారు.
Advertisement
Also read:
వ్యాపారవేత్త రతన్ టాటా తో డేటింగ్ చేసినట్లు ఈమె అంగీకరించారు. 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా కి చెందిన ఇంటర్వ్యూలో ఈమె ఈ విషయాన్ని పంచుకున్నారు. రతన్, నేను చాలా కాలం వెనక్కి వెళ్తాము అతను పరిపూర్ణత కలిగి ఉన్నారు. అతను హాస్యాన్ని కలిగి ఉన్నారు. విదేశాల్లో ఉన్నంత రిలాక్స్డ్ గా భారతదేశంలో లేరు వారి సంబంధం కొనసాగకపోయినా ఇద్దరం సన్నిహిత స్నేహితులుగా ఉన్నామని ఓ సందర్భంలో తెలిపారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!