Advertisement
రతన్ టాటా చనిపోయారు. ఎంతో అరుదుగా కనిపించే విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. అవే విలువలు తుది శ్వాస విడిచే వరకు కొనసాగించారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి తన కోసం ఎవరు ఆందోళన చెందొద్దు అని ట్వీట్ చేశారు. విలాసవంతమైన జీవితం కంటే విలువలతో కూడిన జీవనాన్ని కొనసాగించారు. రతన్ టాటాకు మరో అరుదైన వ్యక్తిత్వం కలిగిన సోదరుడు జిమ్మీ టాటా ఉన్నారు. రతన్ టాటా జీవితాంతం వ్యాపారాలు ఆవిష్కరణలు దాతృత్వాలలో గడపారు.
Advertisement
ఆయన సోదరుడు మాత్రం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ముంబైలోని కొలాబాల్లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్లో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన మొబైల్ ఫోన్ కూడా వాడడం లేదంటే ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆధునిక సాంకేతికత కంటే పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా ఆ సమాచారం తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.
Advertisement
Also read:
Also read:
ఇల్లు విడిచి బయటకి కూడా వెళ్లారట. జిమ్మీ టాటా పూర్తి పేరు జిమ్మీ నావల్ టాటా. టాటా గ్రూప్ లో ఆయనకు గణనీయమైన వాటా ఉంది. కుటుంబ, వ్యాపారం పై పెద్దగా ఆసక్తి చూపకుండా జీవితమంతా సాధారణ ప్రొఫైల్ తోనే గడుపుతున్నారు. ఈ మధ్య జిమ్మీ తన పుట్టినరోజు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన గురించి అందరికీ తెలిసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!