Advertisement
బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఉల్టా పల్టాగా కొనసాగుతోంది. ఇప్పటికే 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటివారం చాలా సైలెంట్ గా ఉన్నారు. మొదటి వారం ఎలిమినేషన్ లో భాగంగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి వెళ్లి పోయింది. ఇక రెండో వారం బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టారు నాగార్జున. దీంతో స్టార్ మా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రెండో వారం నామినేషన్ లో భాగంగా ఒకరికొకరు 8 మందిని నామినేషన్లు చేసుకున్నారు. వారి మనసులోని ప్రస్టేషన్లు బయటపెట్టారు. ఇక రెండో వారం నుంచి మొదలైన వీరి పోరు మూడు గొడవలు ఆరు తిట్లుగా తయారైంది.
Advertisement
Advertisement
రెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. ఆ తర్వాత అందరూ రతిక వైపు తిరిగారు. ప్రస్తుతం రతికను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అలా కొనసాగుతున్న ఈ బిగ్ బాస్ లో రతికా పల్లవి ప్రశాంత్ మొదటి వారం లవ్ ట్రాక్ నడిపారు. ఇక పల్లవి ప్రశాంత్ ను అందరూ ఎప్పుడైతే టార్గెట్ చేశారో అప్పుడే రతిక కూడా టార్గెట్ చేసి పల్లవి ప్రశాంత్ పై విరుచుకుపడింది. ఆ తర్వాత వీరి మధ్య కాస్త దూరం పెరిగింది.
దీంతో రతిక హౌస్ లో మరో లవ్ ట్రాక్ మొదలుపెట్టింది. పల్లవి ప్రశాంత్ తనకు సూట్ కాడని అనుకుందో ఏమో కానీ ప్రస్తుతం ప్రిన్స్ యావర్ తో లవ్ జర్నీ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆసక్తిగా ఫుల్ వీడియో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోమోలో రతిక యావర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. ఇదే సమయంలో పల్లవి ప్రశాంత్ కాస్త బాధతో చూస్తున్నట్టు కనిపిస్తోంది.