Advertisement
రవితేజ ఇడియట్ సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రక్షిత హీరోయిన్ గా చేసింది.. ఇందులో సుచిత్ర అనే పేరు అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది.. ఇడియట్ మూవీ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రక్షిత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.
Advertisement
నాగార్జునతో శివమణి, చిరంజీవితో అందరివాడు, ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా, అలాగే జగపతిబాబుతో కూడా సినిమాలు చేసింది. కన్నడ ఇండస్ట్రీకి చెందినటువంటి రక్షిత అసలు పేరు శ్వేత.. ఇండస్ట్రీకి వచ్చాక రక్షిత గా పేరు మార్పు చేసుకుంది..
Advertisement
అలాంటి ఇడియట్ బ్యూటీనీ ఇప్పుడు చూస్తే మనం గుర్తు పట్టలేం.. కెరియర్ పీక్స్ లో ఉండగానే రక్షిత కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకుంది.. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది.. అంతలోనే కొడుకు కూడా పుట్టేసాడు. ఆ తర్వాత రక్షిత థైరాయిడ్ సమస్యతో చాలా బరువెక్కి పోయింది… ఆ ప్రాబ్లం వల్ల చాలా బరువెక్కి పోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో రాజకీయాల్లోకి వచ్చిన రక్షిత మళ్లీ టెలివిజన్ వైపు కూడా మొగ్గుచూపుతున్నారు.. కన్నడ టీవీ షోస్ లో జడ్జిగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు..
అలాంటి రక్షిత హీరోయిన్ గా చేసినప్పుడు యూత్ లో ఉన్న క్రేజ్ ఏవిధంగా ఉండేదో, ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తే ప్రేక్షకులు గుర్తుపట్టలేక పోతున్నారు.. ఆమె బరువు చూసి షాక్ అవుతున్నారు.. ఇక ఇడియట్ సినిమా లో రవితేజ వేసిన డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది.. కమిషనర్ కూతుళ్లకు పెళ్లిళ్లు కావా.. మొగుళ్ళు రారా అంటూ… అలా అని హీరోయిన్ బొద్దుగా ఉండకూడదా అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.
also read: