Advertisement
రాజ్ అర్జున్,మకరంద్ పాండే,వేదిక,ఇంద్రజ,బాబీ సింహా,అనసూయ,ప్రేమ,జాన్ విజయ్ ఈ సినిమాలో నటించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. నిజాం పాలనలో ఒకప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ మూవీ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు.
Advertisement
సినిమా: రజాకార్
నటులు:రాజ్ అర్జున్,మకరంద్ పాండే,వేదిక,ఇంద్రజ,బాబీ సింహా,అనసూయ,ప్రేమ,జాన్ విజయ్
దర్శకుడు:యాటా సత్యనారాయణ
సినిమా శైలి:తెలుగు, డ్రామా, హిస్టరీ
వ్యవధి:2 Hrs 35 Min
కథ మరియు విశ్లేషణ :
భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948లో వచ్చింది. తెలంగాణ, కర్ణాటకలోని బీదర్ మొదలైన వాటితో పాటుగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను నిజాం రాష్ట్రంగా నిజాం వంశస్థులు పరిపాలించేవాడు. బ్రిటిష్ వాళ్లు 1947లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతున్న టైం లో నిజాం రాష్ట్రాన్ని మాత్రం వారికి ఇష్టం వచ్చిన వాళ్ళతో కలవచ్చన్నారు. అప్పటి నిజాం రాజు (మకరంద దేశ్ పాండే)కు నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపడం నచ్చలేదు. అలా అని భారతదేశంలో కలపడం కి కూడ ఇష్ట పడలేదు. రజాకార్లు అనే ప్రైవేటు సైన్యంతో నిజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్ గా ఏర్పరచాలని భావించారు. రజాకారుల చీఫ్ ఖాసిం రిజ్వి( రాజ్ అర్జున్), మంత్రి(జాన్ విజయ్)లు దుర్మార్గానికి దిగుతారు.
Advertisement
నిజాం రాష్ట్రంలో బతకాలంటే మతం మార్చుకోవాలి లేదంటే బానిసలుగా చూస్తామని అనేక రకాల పన్నులు విధిస్తూ ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉంటారు. ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ (రాజ్ సంపు) ఈ దురాగతాలను తెలుసుకొని నిజాం సంస్థానాన్ని విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఎలాంటి తిరుగు బాట్లు ఏర్పడ్డాయి…? ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు…? తిరుగుబాటు చేస్తున్న వారిని రజాకార్లు ఎలా అణగదొక్కే ప్రయత్నం చేశారు…? చివరికి ఏమైందో తెలియాలంటే సినిమా ని చూడాలి.
నిజాం పాలనలో ఒకప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ మూవీ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంతవ్వగా వేదిక, నిజాం భార్యగా అనుష్య త్రిపాఠి, ప్రేమ, చాకలి ఐలమ్మగా ఇంద్రజ, పోచమ్మ గా అనసూయ భరద్వాజ్ అద్భుతంగా నటించారు. మిగిలిన వారు కూడా బాగా నటించారు. సీరియల్ దర్శకుడు ఆట సత్యనారాయణ సరికొత్త తెలుగు సినిమా దర్శకుడిగా ఫస్ట్ మూవీ ని తీసుకు వచ్చారు. ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా వుంది.
పాజిటివ్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఎడిటింగ్
నటీనటులు
డైరెక్షన్
మైనస్ పాయింట్స్ :
కమ్యూనిస్టుల పాత్రను పక్కకు పెట్టడం
Rating: 3.25/5