Advertisement
జానీ మాస్టర్ పై కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలను సృష్టిస్తోంది. తన దగ్గర పని చేసే అసిస్టెంట్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి యత్నించారని పోలీసులకి కంప్లైంట్ వచ్చింది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ వేధిస్తున్నాడని అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పోలీసులకి ఫిర్యాదు చేసింది, పోలీసులు విచారణ చేస్తున్నారు. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంది. డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
హీరోయిన్ పూనమ్ కౌర్, దర్శకుడు త్రివిక్రమ్ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పోస్ట్ చేశారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం మూలంగా ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ ను ఇగ్నోర్ చేశారని ఆమె అన్నారు. పూనం కౌర్ చేసిన ఆరోపణల పై డైరెక్టర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు.
Advertisement
Also read:
పూనం ఎప్పుడు ఫిర్యాదు చేసింది అనేది తనకు తెలియదని అన్నారు. ఫిర్యాదు బాక్స్‌లో లెటర్ వేస్తే దానిపై ఏదైనా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా రాతపూర్వక ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పూనం కి తమ్మారెడ్డి భరోసా ఇచ్చారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!