Advertisement
టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకమైనది. చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రత్యేకమైనదే. అయితే ఆయన మెగాస్టార్ ఇమేజ్.. ఆయనపై ఫ్యాన్స్ కు ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్లే చిరు కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఆయన ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించినా.. ప్రయోగాలు చేసిన ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి.
Advertisement
అయితే.. చిరంజీవి 152 సినిమాల కెరీర్ లో లో తెలుగులో రెండో అక్షరం ‘ఆ’ అస్సలు అచ్చి రాలేదంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజం. అదెలాగో చూద్దాం. ఆ అక్షరంతో వచ్చిన చిరు మొదటి సినిమా ఆరని మంటలు. ఇంకా ఇమేజ్ రాని టైం అది. పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చిన్న పాత్ర చేసినా ఆడవాళ్లు మీకు జోహార్లు యావరేజ్ అనిపించుకుంది. ఆలయ శిఖరం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎన్నో అంచనాలతో తమిళ కల్ట్ డైరెక్టర్ భారతీరాజాతో చేసిన ఆరాధన నటన పరంగా పేరు తెచ్చింది. కానీ బాక్స్ ఆఫీసు దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. కె విశ్వనాథ్ గారి అపూర్వ సృష్టి ఆపద్బాంధవుడు అవార్డులు తెచ్చిందే తప్ప నిర్మాతకు కాసులు ఇవ్వలేదు.
Advertisement
ఇలా ‘ఆ’ తో మొదలైన ఏ చిత్రం చిరంజీవికి సూపర్ హిట్ ని ఇవ్వలేకపోయింది. హిందీలో ఆజ్ కా గూండారాజ్ విజయవంతం అయ్యింది. కానీ దాన్ని తెలుగు కింద పరిగణించలేం. ఇప్పుడు ఆచార్య వంతు వచ్చింది. ఏం జరుగుతుందో కళ్ళారా చూస్తున్నాం. అయితే మెగాస్టార్ ఆ ఇలా తేడా కొట్టేసింది కానీ మొదటి అక్షరం ఆ మాత్రం హిట్లు ఇచ్చింది. అడవి దొంగ, అల్లుడా మజాకా, అన్నయ్య ఇలా చెప్పుకోదగ్గవి ఉన్నాయి. కానీ అదేంటో మరి ఆ మాత్రం ఊహూ అంటూ ఇలా చేదు ఫలితాలతో మొండికేసింది.
also read;