Advertisement
మంచు ఫ్యామిలీ మనోజ్ యాక్టింగ్ స్టయిల్ డిఫరెంట్ గా ఉంటుంది. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే తన కామెడీ టైమింగ్, ఎమోషనల్ యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కనెక్ట్ చేసుకోగల సత్తా ఆయనది. ఆయన ఎంచుకునే సినిమాలు కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఉంటాయి. అందుకే మంచు ఫ్యామిలీ లో క్రేజీ హీరో అయ్యాడు మనోజ్. కానీ, ఈమధ్య కాలంలో సినిమాల్లో నటించడం తగ్గించాడు. పర్సనల్ లైఫ్ లో వచ్చిన డిస్టర్బన్స్స్ కారణంగానే సినిమా ఫీల్డ్ లో జోరు తగ్గించాడని టాక్ అయితే ఉంది.
Advertisement
మంచు మనోజ్ కు మొదటగా ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిని మోహన్ బాబే కుదిర్చాడు. ఇద్దరికీ దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపించాడు. కొంత కాలం వీరిద్దరూ సజావుగానే ఉన్నప్పటికీ అనుకోని కారణాల వలన వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దానితో వీరిద్దరూ గొడవలు పడి విడాకుల వరకూ వచ్చారు. ఇంతకీ ఆ మనస్పర్థలకు కారణం ఓ సినిమా హీరోయిన్ అట.
Advertisement
వారిద్దరూ కలిసి ఓ సినిమాలో మాత్రమే నటించారు. అయితే ఆమె మనోజ్ ను ఇష్టపడింది. ఆ విషయమే మనోజ్ కి కూడా చెప్పి ప్రపోజ్ చేసిందట. కానీ, మనోజ్ నాకు ఆల్రెడీ పెళ్లి అయ్యిందని, నిన్ను ఎప్పుడు ఆ ఉద్దేశ్యంతోనే చూడలేదని ఆమెకి అర్ధం అయ్యేలా వివరించాడట. కానీ, ఆమె అవన్నీ పట్టించుకోకుండా మనోజ్ చుట్టూనే తిరిగేది. ఫోన్స్ చేస్తూనే ఉండేదట. ఈ విషయంగానే ప్రణతి రెడ్డికి, మనోజ్ కి మధ్య గొడవలు వచ్చాయట. ఈ గొడవలు మోహన్ బాబు వరకు రావడంతో మోహన్ బాబు కూడా ఆ హీరోయిన్ ను ఇంటికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడట. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాలను ఆపలేదు. దీనితో మనోజ్ కు ప్రణతిరెడ్డికి మధ్య గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లారు. ఇందులో నిజం ఎంత ఉందొ తెలియాల్సి ఉంది. ఆ హీరోయిన్ పేరు కూడా బయటకు రాలేదు.
మరిన్ని..
ఇండియన్ ప్లేయర్స్ తో పాకిస్థాన్ ఫాన్స్ అనుచితంగా ప్రవర్తించిన 7 సంఘటనలు.. అసలెవ్వరికీ తెలియదు..!
Bhagavanth Kesari Review: నందమూరి బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమా రివ్యూ అండ్ రేటింగ్ !
Bhagat Singh Life Story, Biography, Essay in Telugu: భగత్ సింగ్ బయోగ్రఫీ