Advertisement
Manchu Manoj First Wife Name: మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దొంగ దొంగది సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు మంచు మనోజ్. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ లో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. మంచు ఫ్యామిలీలో ఉన్న వారిలో ఇతను చాలా సెన్సిబుల్ అని అంటారు. ఈయన వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అంతేకాదు ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ సైతం చేయడు. కానీ ఇటీవలి కాలంలో మనోజ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మార్చ్ 3వ తేదీన దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Read also: అంపైర్ల చేతికి కనిపిస్తున్న ఈ పరికరం ఏంటీ? ఎందుకు వాడుతారో తెలుసా?
కొన్ని విభేదాల కారణంగా మొదటి భార్యతో విడిపోయారు మనోజ్. 2015 వ సంవత్సరంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు మనోజ్. అయితే పెళ్లైన రెండేళ్లకే వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే మొదటి భార్యతో విడిపోవడంపై మనోజ్ తొలిసారి స్పందించాడు. తాజాగా మౌనిక తో కలిసి మనోజ్.. వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న “అలా.. మొదలైంది” షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మొదటి పెళ్లి గురించి మాట్లాడారు మనోజ్.
Advertisement
Manchu Manoj First Wife Name, Photos, Reason Behind Divorce
” నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను. ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి. నేను ఇచ్చిన ప్రేమ పరస్పరం తిరిగి రాలేదు. నేను చాలాసార్లు తన ( ప్రణతి) కోసం ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చింది. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది. ఒకానొక సమయంలో నేను ఎక్కడ నిలబడి ఉన్నాను..? ఎవరికోసం నిలబడ్డానో తెలియక తికమక పడ్డాను. అప్పుడే విడాకులు తీసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. ఇక మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్. తన పనిలో బిజీగా ఉంటూ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోందట.