Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగాస్టార్ ఇంటికి వారసురాలు అడుగు పెట్టింది. రామ్ చరణ్ గత ఏడాది ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ని కొట్టేసారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తన ట్యాలెంట్ ఏంటో చూపించారు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా అయ్యాక లెజెండ్రీ ఫిలిం మేకర్ శంకర్ తీస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా జాయిన్ అయ్యారు. చరణ్ కూతురుతో అన్ని కలిసి వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Advertisement
చరణ్ కూతురు రావడంతో చరణ్ కి బాగా అన్నీ కలిసి వస్తున్నాయి. జూన్ 20న చరణ్ భార్య ఉపాసన డెలివరీ అయింది. ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఈ విషయం తెలియగానే వెంటనే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆనందంలో మునిగిపోయారు. హైదరాబాదులో ఈ ప్రిన్సెస్ కి బారసాల వేడుక చేశారు. ఆమెకి పేరు పెట్టి ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.
Advertisement
చరణ్ ఉపాసనల బిడ్డ పేరు ‘క్లీన్ కారా’ అని రివిల్ చేశారు చిరు. దీంతో ఫాన్స్ అందరు కూడా ఆ పేరుకి ఫిదా అయ్యారు. ఈ వేడుకలో ఉపాసన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు అయితే ఇప్పుడు అందరిలో ఉండే సందేహం ఏంటంటే ఎవరు ఈ పాపకి పేరు పెట్టారు.. ఆ పేరు వెనుక కారణం ఏంటి అని.. ఆ విషయం గురించి ఉపాసన తల్లి శోభన కామినేని ఒక పోస్ట్ చేసారు.
ఉపాసన పుట్టినప్పటి తనకి ఆ పేరుని పెట్టాలని అనుకున్నాం కానీ కుదరలేదు అని శోభన కామినేని చెప్పారు. ఇప్పుడు ఉపాసన కూతురికి ఆ పేరు పెట్టడం తనకి ఆనందంగా ఉందని చెప్పారు శోభన. ఈ పోస్ట్ చూసి ఉపసన లవ్ యు మామ్ అని తల్లికి కృతజ్ఞతలు చెప్పారు.
Also read: