Advertisement
ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఉద్యోగస్తులయితే సమయం దొరికితే, లేదా ఒక సెలవు దొరికితే చాలు హ్యాపీగా నిద్రపోవాలి, లేదా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామంది మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న కునుకు తీస్తే బాగుంటుందని అనుకుంటారు. అలా మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించడం తెలిసిందే. కొందరికి మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు పడుకుంటే కానీ హుషారు కలగదు. అలా మధ్యాహ్నం తిన్న తర్వాత ఎందుకు మత్తుగా అనిపిస్తుంది? దీనికి గల కారణం ఏంటో తెలుసుకుందాం..
Advertisement
Read also: ఐపీఎల్ లో ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన 10 మంది క్రికెటర్లు
Advertisement
దీనికి గల కారణం అన్నంలోని గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలవటమే. అన్నంతో విడుదల అయ్యే మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్లు విశ్రాంతి, మత్తు భావనను కలిగిస్తాయి. మనం తినే ఆహారంలో కొవ్వులు అధికంగా మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటే కనుక భోజనం తిన్న వెంటనే నిద్ర వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కొవ్వు అధికంగా ఉన్న గణాహారం తిన్న తర్వాత, మెదడులోని నిద్ర కేంద్రాలకు సంక్లిష్ట సమ్మేళనాల సంకేతాలు పంపబడతాయి. ఆ సమయంలో నిద్ర ప్రేరేపితం అవుతుంది. అయితే దీనిని అధిగమించడం ఎలా అంటే.. అన్నం తినకుండా ఉండలేకపోతే మామూలు బియ్యం కన్నా పొడవైన బాస్మతి బియ్యం వండుకోవడం మంచిది. వీటిలో గ్లూకోజ్ అంత త్వరగా రక్తంలో కలవదు.
అలా అని ఎక్కువగా కూడా తినకూడదు. ఇక అన్నానికి బదులు జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లో ఏదైనా తినొచ్చు. ఈ రొట్టెలలో పన్నీర్ లేదా సోయా నగేట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్ తో కలిపి చికెన్ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. మధ్యాహ్న భోజనాన్ని మరీ ముఖ్యంగా మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు మితంగా చేయడం మంచిది. ఇలా చేస్తే భోజనానంతరం కూడా మీరు చురుకుగా ఉంటారు.