Advertisement
ఏపీలో రాజకీయాలు మరింత హీట్ పెంచుతున్నాయి. టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. మరోవైపు టీడీపీ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో పరిణామాలను కేంద్ర పార్టీ బిజెపి నిశితంగా గమనిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన కూడా కీలకంగా మారింది. జమిలి ఎన్నికల వేళ జరుగుతున్న ఈ మార్పులు ఏపీ రాజకీయాలను ఎటువైపు తిప్పుతాయో అన్న సందేహాలు ప్రజలలో నెలకొని ఉన్నాయి.
Advertisement
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏపీ బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సరికొత్త రూట్ మాప్ ను సృష్టించుకుంది. నిన్న మొన్నటి వరకు టిడిపి, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని అంతా భావించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. బిజెపి నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. దీనితో వీరి పొత్తు ఉండే అవకాశం లేదని చర్చ జరుగుతోంది.
Advertisement
మరోవైపు బిజెపి ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని ఏపీలో బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం
పట్ల బిజెపి మౌనం వహించడంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారు. మొదట చంద్రబాబు అరెస్ట్ ను నిరసించిన పవన్ కళ్యాణ్ బిజెపి మౌనం వహించడంతో సైలెంట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపైన అరెస్ట్ అయిన చంద్రబాబుని సమర్ధిస్తే ఎన్డీయే కూటమికి భంగం వాటిల్లుతుందని కొందరు కమల నేతలే ఆయన దూకుడుకు కళ్లెం వేసి ఉంటారని మరి కొందరు భావిస్తున్నారు.
మరిన్ని..
చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి వేణుస్వామి ముందే చెప్పారుగా.. ఆయన జోస్యంలో ఏముందంటే?
కేసుల ఊబిలో చిక్కుకున్న టీడీపీ.. ఎన్నికల ఫలితాల్లో మార్పు? నెక్స్ట్ టార్గెట్ ఏంటి?
ఈ 8 ఆహార పదార్ధాలను పొరపాటున కూడా కుక్కర్ లో వండకండి.. ఎందుకంటే?