Advertisement
మన కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహ ప్రవేశం చేసే సమయంలో లేదంటే అద్దె ఇంట్లోకి ప్రవేశించే సమయంలో అయినా సరే పొయ్యిపై పాలు పొంగించడం మన సాంప్రదాయం. పాలు పొంగించి ఇంట్లోకి పోతే అంతా శుభంతో వర్ధిల్లుతుందని నమ్ముతారు. నమ్మకం అనేది ఒక్కటే కాదు దీని వెనుక ప్రత్యేక అర్థం కూడా ఉంది. మనకు సకల సంపదలకు మూలం లక్ష్మీదేవి. ఆమె సముద్రగర్భం నుంచి వచ్చింది. నారాయణ ఉదయేశ్వరుడు పాలసాగరం లోనే పవలిస్తాడు.
Advertisement
అందుకే మనం పాలు పొంగిస్తే అష్ట ఐశ్వర్యాలు ప్రశాంతత సంతానం మరియు ధనం, ఆర్థిక అభివృద్ధి వెల్లి విరుస్తుందని నమ్ముతాం. సాధారణంగా కొత్తగా ఇంట్లోకి వెళ్లేముందు ముందుగా ఆవును ప్రవేశపెట్టి తర్వాత ఆ గృహ యజమాని లోపలికి వెళ్తారు. గోవు అనేది కామదేనువు ప్రతిరూపం. ఆయన తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు. కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిపించి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఈ విధంగా పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖశాంతులకు సంపదకు ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు.
Advertisement
ఇలా మంచి జరుగుతుంది కాబట్టే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇలాంటి ఘట్టాలలో ఆడపడుచులకు ముఖ్య పాత్ర ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వదిన, ఆడపడుచుల మధ్య సంఖ్యత పెరుగుతుంది. దీంతోపాటుగా కొత్త గృహాన్ని నిర్మించి తర్వాత చేసే పనుల్లో బంధుమిత్రులను పిలుస్తాం. ఇలా అందరితో ఆనందంగా గడుపుతాం. ఇలాంటి కార్యక్రమాలు అందరిని ఒక చోట చేర్చడంతో పాటుగా మన మధ్య ఉన్నటువంటి సాంఘిక సమైక్య జీవనాన్ని మెరుగుపరుస్తాయి.
Read also : బిగ్ బాస్ లో వినిపించే గంభీరమైన వాయిస్ ఎవరిదో తెలుసా?