Advertisement
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది. ఈ ఇద్దరి జంట డేటింగ్ చేస్తోంది. అందుకే చాలాసార్లు ముంబైలో కెమెరా కంటపడ్డారు. గోవాలో బర్త్ డే సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు అని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి రెండు సినిమాలు చేశారు. ఇద్దరు కలవడానికి ఎన్నో పనులు ఉంటాయి. డేటింగ్ మాత్రమే గాసిప్సే అని కొందరు అనుకుంటే, మరికొందరు వీరి మధ్య లవ్ ఉందని చెబుతున్నారు. ఇక రెండు రోజుల కిందట, గాలి వార్తలు వ్యాప్తి చేయడంపై నేటి జనులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ.
Advertisement
ఇదంతా పక్కన పెడితే రష్మిక కర్ణాటకకు చెందిన అమ్మాయి. హీరోయిన్ గా ఫస్ట్ చేసిన మూవీ ‘కిరిక్ పార్టీ’. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు. ఇక డైరెక్టర్ రిషబ్ శెట్టి. అవును ‘కాంతార’ హీరో కమ్ డైరెక్టర్ గా చేసిన రిషబ్ శెట్టి నే ‘కిరిక్ పార్టీ’ కూడా డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత రక్షిత్, రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని బ్రేక్ చేసుకున్నారు.
Advertisement
ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోయింది. కన్నడలో పెద్దగా సినిమాలు చేయట్లేదు తెలుగు, తమిళ, హిందీలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా విమానాశ్రయంలో కనిపించిన రష్మికకు ‘కాంతార’ సినిమా చూశారా అని రిపోర్టర్ల నుంచి ప్రశ్న ఎదురైంది. ‘చూడలేదు, త్వరలో చూస్తాను’ అని ఆమె చెప్పింది. దీంతో ఆమెపై కన్నడ నెటిజెన్లు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. స్టార్ హీరోయిన్ అయిపోయే సరికి ఆమె మూలాలు మర్చిపోయిందని, ప్రపంచం మెచ్చిన కాంతారని ఆమె చూడకపోవడం ఏంటి? అని రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో తనపై వచ్చిన, వస్తున్న నెగిటివిటీ కారణంతో రష్మిక అంత పెద్ద ఎమోషనల్ పోస్ట్ పెట్టిందని మాట్లాడుకుంటున్నారు.
Read also: ఎన్టీఆర్ చేతిరాత ఎప్పుడైనా చూశారా ? అక్షరాలు అన్నీ ముత్యాలే