Advertisement
నిన్న నటుడు విజయ్ కాంత్ కన్ను మూసినా సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. పూర్తిగా కోలుకోలేకపోయారు. వెంటిలేటర్ పై ఉన్న ఆయన.. అనారోగ్య కారణాలతోనే మరణించారు. ప్రతి కోలీవుడ్ సినీ ప్రేమికుడికి కెప్టెన్ విజయకాంత్ గురించి తెలిసే ఉంటుంది. తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడమే కాకుండా, నటుడు మరియు అతని రాజకీయ పార్టీ, DMDK, ఉత్తమ ప్రతిపక్షంగా కూడా ఆయన ఉద్భవించారు. 71 ఏళ్ల వయసులో విజయకాంత్ కన్నుమూశారు, ఆయన మృతి పట్ల కోలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. 1979లో ‘ఇన్నికుం ఇలామై’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన ఇప్పటి వరకు 154 సినిమాలు చేశారు.
Advertisement
అయితే.. కోలీవుడ్ తో పాటు ఆయన టాలీవుడ్ లో కూడా చాలా పాపులర్ అయ్యారు. దానికి కారణం ఆయన హిట్ సినిమాలు చాలా వరకు తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. అలాగే.. ఆయన డబ్ సినిమాలు చూసే తెలుగు వాళ్ళు కూడా ఎక్కువమంది ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులో ఏమేమి రీమేక్ అయ్యాయో ఓ లుక్ వేయండి.
1) చట్టానికి కళ్ళు లేవు :
ఈ సినిమాలో చిరంజీవి మాధవి జంటగా నటించారు. ఇది తమిళ సినిమా ‘సట్టం ఒరు ఇరుత్తరై’ కు రీమేక్. విజయ్ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళ్ లో సూపర్ సక్సెస్ అయ్యింది.
2) దేవాంతకుడు :
ఎస్.ఎ.చంద్రశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన వచ్చిన ఈ సినిమాలో విజయ్ కాంత్ తమిళ్ సినిమా ‘వెట్రి’ కి రీమేక్.
3) మంచి మనసులు (1986) :
భాను చందర్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా విజయ్ నటించిన వైదేగి కతిరున్తల్ సినిమాకి రీమేక్.
4) నేనే రాజు నేనే మంత్రి(1987) :
Advertisement
మోహన్ బాబు హీరోగా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన సినిమా “నేనే రాజు నేనే మంత్రి”. ఈ సినిమాకూడా విజయ్ నటించిన ‘నేనే రాజా నేనే మంతిరి'(1985) కి రీమేక్.
5) ఖైదీ నెంబర్ 786 :
చిరంజీవి, భానుప్రియ జంటగా నటించిన సినిమా ఖైదీ నెంబర్ 786 . ఈ సినిమా కూడా విజయ్ ‘అమ్మన్ కోవిల్ కిజకాలే’ కు రీమేక్.
6) దొంగ పెళ్లి (1988) :
శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాని కూడా విజయ్ కాంత్ నటించిన ‘నినైవే ఒరు సంగీతం’ ను చూసి రీమేక్ చేసారు.
7) ధర్మ తేజ (1989) :
కృష్ణం రాజు హీరోగా నటించిన ఈ సినిమా విజయ్ ‘పూంతొట్టా కావల్కరన్’ కు రీమేక్ గా తీయబడింది.
8) నా మొగుడు నాకే సొంతం (1989)
తమిళ్ లో విజయ్ నటించిన ‘ఎన్ పురుషన్ తన్ ఎనక్కు మట్టుమ్తాన్’ సినిమాను తెలుగులో నా మొగుడు నాకే సొంతం పేరుతొ రిలీజ్ చేసారు.
9) చిన రాయుడు (1992) :
వెంకీ నటించిన ఈ సినిమా కూడా విజయ్ చిన్న గౌండర్ (1992) కు రీమేక్.
10) గమ్యం (1998) :
శ్రీకాంత్ నటించిన గమ్యం సినిమాను తమిళ్ ‘భరతన్’ (1992) ను చూసి రీమేక్ చేసారు.
11) మా అన్నయ్య(2000)
తమిళ్ లో విజయ్ నటించిన “వనతైప్పోల” సినిమాను తెలుగులో మా అన్నయ్య పేరుతొ రీమేక్ చేసారు.
12) ఠాగూర్ (2003)
చిరంజీవి ఠాగూర్ కూడా విజయ్ కాంత్ నటించిన ‘రమణ’ కు రీమేక్.
13) ఖుషి ఖుషీగా (2004) :
జగపతి బాబు, వేణు నటించిన ఖుషి ఖుషీగా సినిమా విజయ్ కాంత్ ‘ఎంగల్ అన్న’ (2004) సినిమాను చూసి తీశారు.