Advertisement
ఏఎన్ఆర్,ఎన్టీఆర్, శోభన్ బాబు హీరోలుగా చేస్తున్న సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పారితోషికం చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా కొంతమంది నటీనటులు మాత్రం పారితోషికం ఎంత ఇవ్వాలని అస్సలు అడిగే వారు కాదట. నిర్మాతలు ఎంతిస్తే అంతే తీసుకొని పోయేవారట. అప్పట్లో వారి పాత్రకు స్కోపు ఉందా లేదా అనేది మాత్రమే చూసేవారట.. రెమ్యూనరేషన్ అసలు పట్టించుకునే వారు కాదని కొన్ని ఇంటర్వ్యూలలో తెలియజేశారు.
Advertisement
also read;పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
అలాంటి ఇండస్ట్రీలో ప్రస్తుత హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. వారి పారితోషకంతో చిన్నాచితక సినిమాలే తీయవచ్చు.. అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న స్టార్ హీరోలను రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుత కాలంలో ఒక్కొక్క హీరో 50 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు.. పవన్ కళ్యాణ్ నుంచి ప్రభాస్ వరకు ఎవరు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు.
Advertisement
also read: జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక్కో సినిమాకి 60 కోట్లకు పైగానే అందుకుంటున్నారు. ఇక మహేష్ బాబు ఒక్క సినిమాకి 90 కోట్ల నుంచి 100 కోట్లు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఒక చిత్రానికి 50 కోట్ల నుంచి 60 కోట్లు అందుకుంటున్నారు. రామ్ చరణ్ 60 కోట్లు. ఇక మెగాస్టార్ చిరంజీవి 40 కోట్లు. అల్లు అర్జున్ 60 కోట్లు. ఇక బాలకృష్ణ 20 కోట్లు. అలాగే నాచురల్ స్టార్ నాని ఒక్క సినిమాకి 10 కోట్లకు పైగానే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 31.03.2023