Advertisement
సినిమాలు అన్నాక హిట్లు, ఫ్లాప్ లు కామన్. హిట్ వస్తే సినిమా చేసిన నటులతో పాటు దర్శకుడికి మంచి పేరు వస్తుంది. నిర్మాతకు కాసుల వర్షం కురుస్తుంది. అయితే కొన్ని సార్లు సినిమాలు డిజాస్టర్లు కావడంతో నిర్మాతలు కోలుకోలేని దెబ్బ తింటారు. అంటే ఇక్కడ డబ్బు మెయిన్ ఫాక్టర్.
Advertisement
అయితే ఇప్పటి బడ్జెట్ లెక్కలన్నీ కోట్ల లోనే, హీరోల రెమ్యూనరేషన్ కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో ఉన్నాయి. మరి 1980లో వీటి పరిస్థితి ఏంటి? అప్పటి టాప్ హీరోల రెమ్యూనరేషన్ ఎంత? అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న వారికి సినిమాకు ఎంత ఇచ్చేవారు? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!
#ANR
అప్పటి టాప్ హీరోలలో నాగేశ్వరరావు ఒకరు. ఈయన సినిమాలకు 30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది. ఆ రోజుల్లో ఏఎన్ఆర్ ఒక సినిమాకు దాదాపు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.
# కృష్ణ
అప్పటి స్టార్ హీరోలలో ఒకరైన కృష్ణ సినిమాలకు 20 నుంచి 25 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది. ఆయన కూడా ప్రతి సినిమాకు 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.
# NTR
Advertisement
అప్పట్లో ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అంటే దాదాపు 40 లక్షల బడ్జెట్ అయ్యేది. అన్నగారి సినిమా అంటే కమర్షియల్ గా చాలా హంగులు అద్దాల్సి వచ్చేది. అందుకే బడ్జెట్ కూడా హైగా ఉండేది. ఆయన ప్రతి సినిమాకు 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అప్పట్లో సౌత్ లోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్.
# శోభన్ బాబు
టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు సినిమాలకు కూడా కృష్ణ సినిమాలతో సమానంగా 20 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది. ఈయన కూడా ప్రతి సినిమాకు 6 నుంచి 7 లక్షల వరకు పుచ్చుకునేవాడు.
# సుమన్
అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతున్న హీరో సుమన్. ఆ రోజుల్లో సుమన్ సినిమాలు 17 లక్షల బడ్జెట్ లో పూర్తయ్యేవి. సుమన్ మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.
# చిరంజీవి
అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరంజీవి సినిమాకు 17 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది. ఈయనకు ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. పసివాడి ప్రాణం తర్వాత చిరంజీవి రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది.