Advertisement
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటారు. అఖీరా, ఆద్య గురించి చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు తన ఫ్యామిలీ విషయాలతో పాటుగా జంతువుల సంరక్షణకు సంబంధించిన విషయాలను ఆమె పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆమె ప్రతి పోస్ట్ పై పవన్ ఫాన్స్ రియాక్ట్ అవుతారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో కూడా సందడి చేస్తూ ఉంటారు.
Advertisement
తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిగిన పండగ హోమం గురించి చెప్పారు తన చేతులతో ప్రసాదం చేశానని ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేత్తో ప్రసాదం చేయడం అంటే ఇష్టమని రేణు దేశాయ్ అన్నారు. ఆమె చేసిన వీడియో పై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. వదిన గారు మీరు కొన్నేళ్లు ఓపిక పట్టి ఉంటే బాగుండేది.
ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది ఏది ఏమైనా విధి అంత డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలా మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ చేశారు.
Advertisement
Also read:
అందుకు రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనే వాళ్ళు కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు. దయచేసి నన్ను ఇంక టార్చర్ చేయొద్దు. ఇలాంటి కామెంట్లు పెట్టొద్దు అని ఆమె దండం పెట్టారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి. సూపర్ అమ్మ మీరు అన్న దగ్గర లేకపోయినా పూజలు చేస్తున్నారని ఇంకొక వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కు రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి..? నాకు నా సొంత లైఫ్ ఉండదా మీకు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధ పెడుతున్నారు అని ఆమె ఆవేదన చెందారు. ప్రస్తుతం రేణు దేశాయ్ కి సంబంధించిన ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!