Advertisement
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో కూడా రేణు దేశాయ్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రేణు హైకోర్టులో పిటిషన్ వేసింది అసలు ఏమైంది అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.. హైదరాబాద్ సిటీ ఎంతగా డెవలప్ అవుతుందో చెప్పక్కర్లేదు. మనమంతా చూస్తున్నాము. అయితే హైదరాబాద్ నగరానికి ఇంకాస్త అందాన్ని తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ని చేపట్టింది. దేశం లోనే అతిపెద్ద అక్వేరియం ప్రాజెక్ట్ ని తెలంగాణ గవర్నమెంట్ నిర్మిస్తోంది. రంగారెడ్డి జిల్లా లో ఎకో పార్క్ లో ఈ ఎక్వేరియం ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
బెంగళూరు సహా పలు నగరాల్లో అండర్ టర్నల్ అక్వేరియంలు ఉన్నాయి. ఇలాంటిది హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇదివరకే కొత్వాల్ గూడలో శంకుస్థాపన కూడా చేశారు ఇప్పుడు ఈ ఎకో పార్క్ వివాదానికి దారి తీస్తోంది. ఆక్వా మెరైన్ పార్క్ ని నిరసిస్తూ కొంతమంది ఉద్యమాన్ని చేపట్టారు. కృత్రిమ సరస్సుని ఏర్పాటు చేయడం వలన పర్యవరణానికి హానికరమని రేణు దేశాయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. శ్రీ విద్య, సదా, దర్శకుడు శశికిరణ్ తో పాటు పలువురు సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలిచారు. చాలా చోట్ల ఇలాంటివి ఉన్నాయి ఎందుకు ఇక్కడ నిర్మించకూడదని ప్రశ్నించారు. విచారణని వాయిదా వేశారు. మరి న్యాయస్థానం ఏ తీర్పు చెప్తుందో చూడాలి.
Also read: