Advertisement
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న రేణుదేశాయ్ అంటే తెలియని వారు ఉండరు. బద్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంది.. కొద్దిరోజులు సంసార జీవితం బాగానే ఉన్నా తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 2013 లో పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.. అలాంటి రేణు దేశాయ్ గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వస్తున్నాయి.. తను రెండో పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది..
Advertisement
ALSO READ;టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్ల రూపాయల కట్నకానుకలు తీసుకున్న స్టార్ హీరోలు ఇంతమంది ఉన్నారా..?
Advertisement
అయితే ఆమె తనకు తోడు అవసరమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండో వివాహానికి సిద్ధమైన రేణుదేశాయ్ కి 2018లో ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ పెళ్లి ప్రస్తావన రాలేదు.. అయితే తాజాగా రేణుదేశాయ్ చేసిన ఒక పోస్ట్ తో రెండో పెళ్లి పై మరోసారి చర్చకు దారి తీసింది. మన జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకొని నడిపించే ఒక తోడు అనేది కావాలి అని ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
దీని తర్వాత మరొక పోస్ట్ లో మీ సోల్ మెట్ ని వెతకడానికి ముందుగా మిమ్మల్ని మీరే పూర్తిగా అర్థం చేసుకోండి అని మరొక పోస్ట్ ని కూడా షేర్ చేసింది. ఉన్నట్టుండి రేణుదేశాయ్ ఈ వీడియోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా మొగ దిక్కు లేని రేణుదేశాయ్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని తన సంసార జీవితానికి స్వాగతం పలకాలని కొందరు నెటిజెన్స్ కామెంట్ చేస్తుంటే, మరికొంతమందేమో ఆమె మాటలను ఖండిస్తున్నారు. మరి ఈ వ్యవహారం చివరికి ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
ALSO READ;ఆ సినిమా కోసం బాలకృష్ణకు 3 కండీషన్స్ పెట్టిన NTR !