Advertisement
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఫొటోస్ ని అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలానే ముఖ్యమైన విషయాలని కూడా సోషల్ మీడియా ద్వారా రేణు దేశాయ్ పంచుకుంటూ ఉంటుంది. అయితే రేణు దేశాయి ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గతంలో తిట్టిపోసేవారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.
Advertisement
రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది దాంతో అంతా వెరైటీగా జరిగింది. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. డబ్బు మీద ఆయనకి ఆసక్తి లేదు. సమాజం పట్ల ఆసక్తి ఉన్న మనిషి ఆయన అని రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది. అలానే ఒక అవకాశం ఇవ్వండి అని కూడా ఆమె చెప్పింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెని నెత్తిన పెట్టుకుంటున్నారు.
Advertisement
ఇతర పార్టీల వాళ్లు, పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఆమెను తిట్టిపోస్తున్నారు. ఒక సోషల్ మీడియా యూజర్ అయితే ”పవన్ కళ్యాణ్ నిన్ను తన్ని తరిమేసాడు మేడం అని” కామెంట్ చేశారు. ఆ పోస్ట్ కి రేణు దేశాయ్ స్పందిస్తూ ”నన్ను తిట్టండి మనశ్శాంతి దొరకకపోతే ఇంకా తిట్టండి. అభిమానుల నుండి అలానే యాంటీ ఫ్యాన్స్ నుండి తిట్లు తినడానికి నా జీవితం ఉంది కానివ్వండి” అంటూ రేణు కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also read: