Advertisement
దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తరువాత రేణు దేశాయ్ తెలుగు సినిమా తెరపై ప్రేక్షకులకు కనిపించారు. మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వర్రావు సినిమాలో హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ నటించారు. ఈ క్యారక్టర్ లో రేణు దేశాయ్ జీవించారు అనే చెప్పవచ్చు.
Advertisement
మొత్తానికి రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ లో ఉన్నారు. అయితే.. రేణు దేశాయ్ నిజానికి గత ఏడాదిలోనే రీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉందిట. మహేష్ బాబు సినిమా ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ అవకాశాన్ని రేణు దేశాయ్ వదులుకుంది.
అసలు అది ఏమి సినిమా? ఈ అవకాశాన్ని రేణు దేశాయ్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ విషయం గురించి రేణు దేశాయ్ వద్ద ప్రస్తావించగా.. ఆ సినిమాను వదులుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయని..
Advertisement
అవి అన్ని చెబితే గొడవలు తప్ప ప్రయోజనం లేదని రేణు దేశాయ్ కామెంట్స్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా సర్కారు వారి పాట.
ఈ సినిమాలో బ్యాంకు ఆఫీసర్ పాత్రలో నటి నదియా కనిపించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ పాత్ర ఆఫర్ ముందు రేణు దేశాయ్ వద్దకు వెళ్లిందట. రేణుకి కూడా ఆ మేనేజర్ రోల్ బాగా నచ్చిందట. మొదట ఇందులో యాక్ట్ చెయ్యాలని ఒకే కూడా చెప్పారట.
కానీ అనుకోని కారణాల వలన ఈ ఆఫర్ ని తిరస్కరించాల్సి వచ్చిందని రేణు చెప్పారు. ఈ కారణాలు ఇప్పుడు చెప్తే కాంట్రవర్సీ అవుతుందని ఆమె అన్నారు. సైలెంట్ గా ఉండడమే మంచిది అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ మీరు చదవచ్చు ! తెలుగు న్యూస్ కోసం అయితే ఇక్కడ చదవండి !