Advertisement
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ యాత్ర సిరిసిల్ల నియోజకవర్గంలోకి ఎంటర్ అయింది. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా హస్తం నేతలు ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే.. ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ కారణంగా 6 కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది.
Advertisement
ఈ ఘటనలో 4 కార్లతో పాటు ఇద్దరు జర్నలిస్టుల కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్లను సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికి పెద్దగా ప్రమాదం జరగ్గపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. రేవంత్ రెడ్డి శ్రీపాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజీ దగ్గర ఈ ఘటన జరిగింది.
Advertisement
మరోవైపు శ్రీపాద 9వ ప్యాకేజీని పరిశీలించిన రేవంత్.. మంత్రి కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కక్కుర్తితో మంత్రి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాలువ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచారని.. కడప జిల్లా వారికి కాంట్రాక్ట్ అప్పగించారని మండిపడ్డారు. లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని ఆరోపించారు.
పనులు సరిగ్గా చేయడం లేదన్న నెపంతో కేటీఆర్ తన అనుయాయులకు అప్పగించారని విమర్శించారు. పనులు ఆలస్యం కావడానికి, అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంత రైతులపై కాంట్రాక్టర్లకు ప్రేమ లేదని చెప్పారు. కేటీఆర్ వారికి లొంగిపోవడం వల్లే పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు రేవంత్.