Advertisement
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటూ.. ఖజానాకు నష్టం వాటిల్లకుండా చూస్తున్నారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన తన సొంత కారునే వాడుతున్నారు. ప్రోటోకాల్ లో ఉండాల్సిన కార్ల సంఖ్యా కూడా తగ్గించాల్సిందిగా సూచించారు. అయితే.. సొంత కార్ కాకుండా.. బులెట్ ప్రూఫ్ ఉన్న కార్ ని వాడాలని అధికారులు సూచించినప్పటికీ.. తన కార్ కే బులెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయాలనీ కోరారట.
Advertisement
ఇక సీఎం గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో కూడా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. బాధ్యత కలిగిన, నిజాయితీ పరులైన అధికారులను తన టీం లోకి తీసుకుంటున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టాకా.. ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సమయంలో ఆయనకు తెలంగాణ భవన్ నుంచి భోజనం వచ్చింది. ఈ విషయం ఇంట్లో వంట మనిషి రేవంత్ కు తెలియచేసారు.
Advertisement
దీనితో ఆయన ఆ వంట మనిషికి వార్నింగ్ ఇచ్చారట. “ఇలా అయితే.. నిన్ను పని లోంచి తీసేయాల్సి ఉంటుంది.. నా సొంత భోజనమే నేను తింటా.. ప్రోటోకాల్ లాంటివి ఏమీ వద్దు. ఎప్పటి లానే వంట చెయ్యాలి.. ” అంటూ రేవంత్ రెడ్డి వంట మనిషికి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారట. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చిన తరువాత.. అక్కడ నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. డిప్యూటీ సీఎం కాంప్ ఆఫీస్ ను ప్రజా భవన్ లోనే ఉంచగా.. సీఎం క్యాంప్ ఆఫీస్ ను మాత్రం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఇందుకు ఖర్చు చెయ్యకుండా ఓ షెడ్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక, పాత పద్ధతిలో జర్నలిస్ట్ లతో చిట్ చాట్ మాట్లాడడానికి అనుమతిస్తున్నారు. అలాగే.. ఆ సమయంలో సందర్సకులు కూడా రావచ్చట. ఈ విధానాన్ని కేసీఆర్ ఇష్టపడలేదు. ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఈ చిట్ చాట్ కు దూరంగా ఉన్నారు.
Read More:
సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ కి నళిని ఎలా స్పందించిందంటే..?
Telugu Paper Cartoon News: Today Cartoon in Telugu Papers 17 December 2023, తెలుగు న్యూస్ కార్టూన్స్
ఆ సమయంలో భర్త మరో మహిళతో ఉన్నా తప్పులేదు.. హై కోర్ట్ సంచలన తీర్పు!