Advertisement
కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులను అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డం పడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అమెరికాలో ఇద్దరు దాక్కున్నారని వారిని ఇండియాకు తీసుకోచ్చెందుకు ప్రయత్నం చేస్తుంటే …రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ సహకరించడం లేదన్నారు. యూఎస్ లో ఉన్న ఆ ఇద్దరు ఇండియాకు వస్తే 48 గంటల్లోనే కల్వకుంట్ల కుటుంబ భరతం పడుతామన్నారు.
Advertisement
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే… బీఆర్ఎస్ నేతలను బుక్ చేసేందుకు బీజేపీ అడ్డం పడుతుందని అనుకోవచ్చు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను ఫిక్స్ చేసేందుకు రేవంత్ కు అవకాశం ఉంది. ఈ కేసులో కేటీఆర్ కు హైకోర్టు సహా సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ ఫిక్స్ అయితే ఇప్పటికిప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేయవచ్చు. కానీ, ఈ కేసు విషయంలోనూ దూకుడు కనిపించడం లేదు..స్లోగా నడుస్తోంది. అప్పట్లో కేటీఆర్ ను విచారణకు పిలిచి హడావిడి చేశారు..మళ్లీ పిలుస్తారో లేదో తెలియదు..విచారణకు పిలిచి ఏసీబీ ఎం తేల్చిందో కూడా తెలియదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు రేవంత్. బీజేపీ కోసమే బీఆర్ఎస్ పోటీలో లేదని రేవంత్ అభిప్రాయం. పైగా కల్వకుంట్ల కుటుంబాన్ని కేసుల నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కానీ, బీజేపీ అడ్డుకుంటే రేవంత్ నిష్చేష్టుడై ఉంటారా? అదే నిజమైతే దాన్ని రేవంత్ అసమర్ధతగా భావించాల్సి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.