Advertisement
ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నడంతో పొలిటికల్ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని జోరుగా మొదలుపెట్టాయి. ఏపీలో పాలిటిక్స్ హీట్ సినిమాలని కూడా తాకుతోంది. ఎన్నికలు నేపథ్యంలో మరింత రచ్చ జరిగే విధంగా యాత్ర టు, రాజధాని ఫైల్స్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల గురించి జనాల్లో బాగానే చర్చ జరుగుతోంది. ఇంకో రెండు రోజుల్లో రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాతో ఎలక్షన్ల హీట్ ని పెంచడానికి రెడీగా ఉన్నారు వర్మ సాధారణంగానే సినిమా తీస్తే పెద్ద వివాదంగా మారుతుంది. అటువంటిది కొందరు రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేసే సినిమా చేశారంటే ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు.
Advertisement
వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసే విధంగా ఉండబోతున్నట్లు విమర్శలు అయితే మొదలైపోయాయి. వర్మ చేస్తున్న పొలిటికల్ కామెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి ఎటువంటి సంచన కామెంట్స్ కి అయినా వర్మ అసలు వెనుకాడరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ షాపింగ్ కామెంట్స్ చేశారు.
Advertisement
వర్మ తరచుగా చంద్రబాబుని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. వ్యూహం ప్రమోషన్ లో భాగంగా వర్మ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ దూరం చేసిందా, అతనే దూరంగా ఉంటున్నాడా అనేది తెలియదు.
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఆ భయం టిడిపిలో ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటన చేస్తే ఓవర్ నైట్ లో టిడిపి ఫినిష్ అయిపోతుందని వర్మ సంచలన కామెంట్ చేశారు. చంద్రబాబు లోకేష్ కి ఇక ఏమీ మిగలదని వర్మ చెప్పారు బహుశా ఆ భయంతోనే జూనియర్ ఎన్టీఆర్ మీద ద్వేషం పెంచుకుని ఉండొచ్చు అని రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!