Advertisement
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుతం తాను తన సినిమాలతో కాకుండా తన ట్వీట్స్ తోనే క్రేజ్ సంపాదిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఇష్యూ వచ్చిన తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ, అందరిని తన వైపు కు తిప్పుకుంటారు. అలాగే తన సినిమాలకు ట్వీట్స్ తోనే ప్రచారం చేసుకుంటారు. ఏదైనా బలంగా చెప్పాల్సివస్తే అవతలి వారిని నోరు తెరవకుండా తన ట్వీట్స్ తోనే ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఏదైనా విషయాన్ని అనుకూలంగా వ్యతిరేకంగా కూడా చెప్పగలిగే టాలెంట్ రామ్ గోపాల్ వర్మ సొంతం.
Advertisement
ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా వర్మ మరో సంచలనానికి తెర తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం నేడు వర్మ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడమే. సడన్ గా? జగన్ తో మీటింగ్ ఏంటి ఎందుకు? అని ప్రతి ఒక్కరు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడు గంటలు జరిగిన ఈ మీటింగ్ లో సినిమాల గురించి వర్మ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం ఎంతటి రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Advertisement
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాడు రాజకీయాలకు పనికిరాడని, భార్యలనే సరిగ్గా చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఎలా చూసుకుంటాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవలే మంగళగిరి మీటింగ్ లో ఆ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మునుపెన్నడూ లేని విధంగా పవన్ కోపాన్ని చూశారు ప్రజలు. ఇక ఇదంతా స్టోరీగా చేసుకొని వర్మ సినిమాగా తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే వర్మ జగన్ ను కలిసి ఈ స్టోరీని వినిపించాడట. ఇప్పటికే పవన్ పై వర్మ రెండు సినిమాలు తీశాడు. ఇక ఎన్నికల సమయంలో పవన్ ను టార్గెట్ చేయడానికి వర్మ ఇలాంటి ప్లాన్ వేసినట్లు జనసేన అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.
READ ALSO : మరో 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి !