Advertisement
ప్రస్తుతం ట్రెండింగ్ సినిమా కాంతారా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కాంతారా. ఈ ఏడాది నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దాదాపు 16 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడంతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భూతలోక అనే కళ నేపథ్యంతో విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు.
Advertisement
నటుడిగా, దర్శకుడిగా ఈ సినిమాతో రిషబ్ శెట్టి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. రాజమౌళితో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ కాంతారా సినిమా పై ప్రశంసలు కురిపించారు. తమకు దానంగా వచ్చిన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన రాజవంశీయులపై శివ అనే యువకుడు సాధించిన పోరాటంతో ఈ సినిమా తెరకెక్కింది.
Advertisement
కాగా, ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్ గా బాధ్యతల్ని నిర్వర్తించినందుకు రిషబ్ శెట్టి కేవలం నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే అందుకున్నట్లు సమాచారం. రిషబ్ వల్లే ఈ సినిమా సక్సెస్ అయిన అతడికి మాత్రం చాలా తక్కువ మొత్తమే రెమ్యూనరేషన్ దక్కినట్లు చెబుతున్నారు. రిషబ్ శెట్టి తర్వాత కిషోర్, సప్తమి గౌడలకు తలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో కాంతారా సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. రెండు కోట్లకు ఈ సినిమా హక్కులను దక్కించుకోగా దాదాపు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
Read also: ఎక్కువ సినిమాలు రీమేక్ చేసిన టాలీవుడ్ హీరోలు