Advertisement
టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా పంత్ తన బ్యాటింగ్ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా కివీస్ తో జరిగిన చివరి వన్డేలో సైతం పంత్ దారుణంగా విఫలమయ్యాడు. 16 బంతులాడి కేవలం 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే, పంత్ పూర్ ఫామ్ కంటే కూడా అతని మైండ్ సరిగ్గా లేదని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Advertisement
READ ALSO : T20లలో మళ్లీ కనిపించని 5 గురు భారత ఆటగాళ్లు వీళ్ళే !
అందుకు కారణం, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా, మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్ మన్ గిల్ వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. ధావన్, గిల్ పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా 55 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వన్ డౌన్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నాడు. అలాగే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ సైతం కాస్త నిదానంగా తన శైలికి భిన్నంగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 15 బంతులాడి 2 ఫోర్లతో 10 పరుగుల వద్ద ఉన్న సమయంలో మిచెల్ ఇన్నింగ్స్ 21వ ఓవర్ లో వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ షాట్ ఆడాడు.
Advertisement
అసలే పుల్ షాట్ ఆడటంతో కాస్త వీకైన పంత్, అనవసరంగా ఆ షాట్ ఆడి, వికెట్ సమర్పించుకున్నాడు. ఆ టైమ్ లో పంత్ అలాంటి షార్ట్ ఆడాల్సిన అవసరమే లేదు. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకోకుండా, చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి టైం లో నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ కు ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ, ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి ఉంటే జట్టు మంచి స్థితిలో ఉండేది. అలాగే ప్రస్తుతం ఫామ్ లో లేని పంత్, కాస్త ఎక్కువ సమయం పిచ్ పై గడిపి ఉంటే, అతనికి కూడా కాన్ఫిడెన్స్ పెరిగి 60, 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా, ఫామ్ అందుకునే అవకాశం ఉండేది. అలా కాకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా బ్యాడ్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడంటూ పంత్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
READ ALSO : కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై BCCI భారీ కుట్ర! కోచ్ పదవి ఔట్ ?