Advertisement
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ త్వరలోనే గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా అతని రీ ఎంట్రీకి సైతం ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ లో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కి రిషబ్ పంత్ కారులో వెళ్తుండగా రూర్కీ సమీపంలో అతను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది.
Advertisement
Advertisement
దీంతో కారులో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన పంత్ అద్దం పగులగొట్టుకొని బయటికి దూకేశాడు. అతని తల, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. కాలు ప్రాక్చర్ అయింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గాయాల నుంచి కోలుకున్న పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. చాలా వేగంగా కోలుకున్న పంత్ వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ వరకు పూర్తి ఫిట్ నెస్ సాధించనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 షెడ్యూల్ లో భాగంగా ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్ కి రానుంది. ఈ సిరీస్ జనవరిలో జరుగనుంది. ఈ సిరీస్ వరకు పంత్ ఫిట్ నెస్ సాధిస్తాడని.. బీసీసీఐ కి చెందిన ఓ అధికారి వెల్లడించాడు.
Also Read :