Advertisement
BCCI కి కొత్త బాస్ రానున్నాడు. గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ ఎన్నిక కావడం దాదాపుగా ఖాయం అయింది. కానీ బీసీసీఐ అధ్యక్ష పదవిని వదులుకోవడం గంగూలీ కి ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ రెండోసారి అధ్యక్ష పదవిలో ఎవరిని కొనసాగించే ఆనవాయితీ లేదనే సాకుతో గంగూలీని తప్పించాలని సమాచారం. దీంతో రోజర్ బిన్ని పేరును సౌరబ్ గంగూలీ ప్రతిపాదించలేదని, ఆఫీసు నుంచి అందరూ వెళ్లిపోయాక గంగూలీ చివరగా వెళ్లారని తెలుస్తోంది.
Advertisement
READ ALSO : గరికపాటి వ్యాఖ్యలపై మొదటి సారి స్పందించిన చిరు ! అయన ఒక…. అంటూ !
అయితే, తన మాజీ సహచరుడు రోజర్ బిన్నీ తదుపరి బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతాడంటూ వస్తున్న వార్తల పట్ల సంతోషాన్ని వెలిబుచ్చాడు మాజీ కోచ్ రవి శాస్త్రి. ‘బీసీసీఐ అధ్యక్షుడి విషయంలో రోజర్ పేరు వినిపించడం పట్ల నేను సంతోషిస్తున్నాను. 1983 నాటి ప్రపంచ కప్ లో అతను నా సహచర టీం మేట్. అతను ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. అతనికి తదుపరి ఉన్నత బాధ్యతలు అప్పజెప్పేందుకు మంచి అవకాశం ఉంది. ఇప్పుడు అతను బీసీసీఐ అధ్యక్షుడిగా గనుక నియమితుడైతే బీసీసీఐ చరిత్రలో తొలిసారిగా ప్రపంచ కప్ విజేత జట్టు ప్లేయర్ ఆ పదవిని అలంకరించినందుకు నేను చాలా సంతోషిస్తాను’ అని రవి శాస్త్రి తెలిపాడు.
Advertisement
బిన్ని బీసీసీఐ లో కొత్త శక్తిని తీసుకురాగలడని, అతని పదవికాలంలో కొత్త పనులు ఎన్నో చేయొచ్చని రవి శాస్త్రి చెప్పారు. ‘నేను మీడియాలో రోజర్ బిన్నీ గురించి వస్తున్న వార్తలను చదివాను. అయితే బీసీసీఐ అధ్యక్షుడి పదవిలో ఎవరు రెండవసారి అధ్యక్షుడిగా కాలేదు. అందువల్ల గంగూలీ స్థానంలో బిన్నీ రావడం దాదాపు లాంచనమే. ఇది మంచిదే. ఎందుకంటే మరొక క్రికెటర్ కు ఆ పదవిలో పనిచేసే అవకాశం లభిస్తుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మీరు కొన్నాళ్లపాటు కొన్ని బాధ్యతలు నిర్వర్తించగలరు. ఆపై ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ముందుకు సాగిపోవాల్సిందే. నేను ఈరోజు ఓ కర్తవ్యం చేస్తున్నాను, అంటే మరో మూడేళ్ల తర్వాత కూడా ఇదే కర్తవ్యంతో ముడి పెట్టుకొని ఉండరు కదా, కొత్త వ్యక్తులు వస్తారు, కొత్త వ్యక్తులు కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది ఒక రకంగా ఆరోగ్యకరమైన వ్యవహారం. అందుకే మార్పు రావాలి.
READ ALSO : ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం