Advertisement
చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిన్న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇంగ్లాండు వేసిన బానిస సంకెళ్లను విడిపించుకొని స్వేచ్ఛ వాయువును పీల్చి నిన్నటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారతావని, ఆగస్టు 15వ తేదీన తేదీని ఈసారి ఘనంగా జరుపుకుంది. 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశమంతా ఆజాది కా అమృత్ మహోత్సవ్ ను కూడా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ప్రతి ఇంటిలోనూ జాతీయ జెండాను ఎగరవేసేలా హర్ గార్ తిరంగా కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించింది. 75 ఏళ్ల స్వాతంత్రాన్ని పురస్కరించుకొని భారతీయులకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
ఈ సందర్భంగా టీమిండియా ప్రస్తుత మాజీ క్రికెటర్లు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా భారతీయ సహోదరులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దేశ ప్రజలకు, తన అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జాతీయ జెండాను పట్టుకుని.. ఫోటోను షేర్ చేసి మరీ.. రోహిత్ శర్మ దేశ ప్రజలకు, తన అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
అయితే.. ఈ ట్వీటే ఇప్పుడు వివాదంగా మారిపోయింది. రోహిత్ శర్మ ఆ పోస్టులో పట్టుకున్న జెండా..మార్ఫింగ్ చేసినట్లు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జాతీయ జెండాను ఎడిటింగ్ చేసి.. శుభాకాంక్షలు చెప్పడం ఏంటి నిలదీస్తున్నారు. జాతీయ జెండా కొనుక్కునే డబ్బులు లేకపోతే.. మేమైనా పైసలు ఇచ్చేవాళ్లం కదా అంటూ మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఫోటో షాప్ లో ఎడిటింగ్ చేయించావా రోహిత్ అంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఒక జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఉండి.. ఇలా వ్యవహరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
Read Also : ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఇవే!
https://twitter.com/WintxrfellViz/status/1559069916090707969?s=20&t=8hW7p-ggcjijzyJBMjLRtg