Advertisement
రోహిత్ శర్మ ఈ పేరు చెబితే క్రికెట్ ఫాన్స్ మాత్రమే కాదు యావత్ భారత్ లోని ప్రతి వ్యక్తి అభిమానించే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా టీం ఇండియా కి, ముంబై ఇండియన్స్ కి ఎలాంటి సేవలు అందించారో అందరికి తెలిసిందే !
Advertisement
ఇక అతి త్వరలో జరగనున్న ఐపీల్ 2024 జరగబోయే మ్యాచుల నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించి అందరిని ఆశ్చర్య పరిచింది. అంతే కాదు గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్య ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
దీనితో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అంతే కాదు #ShameOnMI హాష్ టాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ముంబై జట్టుకి ఎన్నో విజయాల్ని అందించిన ఒక వ్యక్తిని ఇలా దారుణంగా తప్పించడం పైన మండి పడుతున్నారు.
Advertisement
దెబ్బ కి దెబ్బ అన్నట్టుగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ సోషల్ మీడియా లోని పేజెస్ నుంచి 4 లక్షల మంది అన్ ఫాలో చేసి ముంబై యాజమాన్యానికి గట్టి షాక్ ఇచ్చారు. ఇక ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం మీద రోహిత్ శర్మ ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 158 మ్యాచ్‌ల్లో 87 విజయాలతో పాటు 67 పరాజయాలు నమోదు చేసింది. 4 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. 2021, 2022లో ముంబై దారుణంగా విఫలం కాగా.. ఐపీఎల్ 2023 సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరింది.
ఇక రోహిత్ ప్రయాణం ముంబై ఇండియన్స్ తో ఎలా సాగిందంటే ? 2013 లో రికీ పాంటింగ్ నుంచి సారధ్య బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ తోలి సారి ముంబై ఇండియన్స్ కి టైటిల్ ని తీసుకురావడం లో తన వంతు కృషి చేసాడు. ఆ తర్వాత 2015, 2017,2019,2020 లో కూడా ముంబై ఐపీల్ టైటిల్ ఛాంపియన్స్ గా నిలిచింది.