Advertisement
భారతదేశంలో జాతీయ జెండాను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున, అలాగే జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఎగుర వేస్తూ ఉంటారు.. ఈ రోజున చాలా మంది వివిధ రకాల నిబంధనల నడుమ జెండాను ఎగురవేస్తారు.. ఈ క్రమంలోనే ఆగస్టు 15, జనవరి 26 రోజున జెండా హోస్టింగ్ సమయంలో ఈ విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.. అయితే ఆగస్టు 15వ తేదీన జెండాని స్తంభం మధ్యలో కడతారు.
Advertisement
దాన్ని ఎగరవేసే టైంలో ఆ జెండాను స్తంభం మధ్య నుంచి పై వరకు లాగి ఎగరవేస్తారు.. ఇలా చేయడంలో కూడా ప్రత్యేకమైన అర్థమున్నది..అదేంటంటే ఒకరి కింద ఇంతవరకు ఒదిగి ఉన్న మనం స్వేచ్చా జీవులై గర్వంగా తల ఎత్తినామని అర్థం వస్తుంది. అదే విధంగా జనవరి 26 వ తేదీన కూడా జెండాను స్తంభం పై అంచున కట్టి దాని ముడి వీడి ఎగిరేలా చేస్తారు. దీని ప్రధానార్థం మనం ఆల్రెడీ స్వతంత్రులం మనకంటూ ఒక చట్టాన్ని తయారు చేసుకున్న రోజునే ఈ విధంగా చేయాలని మన రాజ్యాంగంలో పెద్దలు నిర్దేశించారు..
Advertisement
ఈ పద్ధతుల్లోనే మనం ఆగస్టు 15వ తేదీన జెండాను పైకెత్తుతాం.. అలాగే జనవరి 26 వ తేదీన జెండాను ఎగుర వేస్తాము.. ఇది అంతా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరుగుతూ వస్తోంది. కానీ చాలా మంది ఈ నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనే విషయం మీరంతా మరోసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది ఈ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. జనవరి 26 వ తేదీన జెండాను పైభాగాన కట్టి ముడి ఊడేలా లాగి ఎగరేస్తారు. కానీ ఈ నిబంధనలను ప్రస్తుతం ఎవరు అనుసరిస్తున్నట్లు లేదు. ఏది ఏమైనా మనకు పూర్వ కాలం నుంచి వస్తున్న ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించి దేశ గౌరవాన్ని, జెండా గౌరవాన్ని కాపాడుకుందాం.
ALSO READ: