Advertisement
Devi Navaratri 2023 Telugu: శరన్నవరాత్రుల సమయంలో అందరు నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి రోజుకో రంగు చీరలో అలంకరించి , రోజుకో అవతారంలో.. రకరకాల నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు. ఆ తరువాత ఆఖరు దసరా రోజున ఆయుధ పూజ కూడా చేసుకుని అమ్మవారికి ఊరేగింపులు వేయిస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని కొలుస్తారు. నవరాత్రులలో అమ్మవారిని పూజించుకునేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండ పాటించాలి. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి.
Advertisement
ఈ తొమ్మిది రోజుల పాటు క్రమం తప్పకుండ దుర్గ అమ్మవారి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అమ్మవారికి దీపారాధన చేసి, పూలు పెట్టి, నైవేద్యం పెట్టి, హారతి ఇవ్వాలి. ప్రతి రోజు అమ్మవారికి నీటిని సమర్పిస్తే మంచిది. అలాగే.. ఈ తొమ్మిది రోజుల పాటు శుభ్రమైన వస్త్రాలను మాత్రమే ధరించాలి. అలాగే చెప్పులు వేసుకోకుండా ఉండడం.. గుమ్మానికి దగ్గరగా చెప్పులు వదలకుండా చేయడం మంచిది.
Advertisement
ఇక ఓపిక ఉన్న వారు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉండి ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది. అమ్మవారి ఆశీస్సులు పొందడం కోసం, ఆమెకు మరింత దగ్గరగా ఉండడం కోసమే ఈ ఉపవాసం. ఇక అమ్మవారు అలంకార ప్రియురాలు. ఆమెకు అలంకారం చేయించుకోవడం చాలా ఇష్టం. అందుకే తొమ్మిది రోజుల పాటు ఆమెకు రకరకాల అలంకారం చేయండి. అమ్మవారికి గాజులు, పూలు, కొత్తవస్త్రాలతో నిత్యం అలంకరించండి. అష్టమిరోజున కన్యలు పూజ చేస్తే మంచిది. తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి వారి కాళ్లకు పసుపు రాయాలి. ఇక ఈ తొమ్మిది రోజుల పాటు వెలుగుతూ ఉండేలా అఖండ జ్యోతిని పెట్టాలి. అందులో నిత్యం నెయ్యి వేస్తూ ఉండాలి. నెయ్యి లేకుంటే దీపారాధన నూనె అయినా వాడవచ్చు. కానీ ఆవనూనె మాత్రం వాడకండి. ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లి,వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. హెయిర్ కట్ చేయించుకోకపోవడం మంచిది. మద్యం, మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి.
మరిన్ని..
దేవి నవరాత్రుల వెనుక ఉన్న ఈ కథ గురించి తెలుసా? అసలు దేవి నవరాత్రులు ఎలా ప్రారంభం అయ్యాయి అంటే?
Raviteja Tiger Nageswara Rao Movie Dialogues, టైగర్ నాగేశ్వర రావు మూవీ డైలాగ్స్
Telangana Elections: బిఆర్ఎస్ ను దెబ్బకొట్టేలా టి-కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.!