Advertisement
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు పెడుతున్న పోస్టులు శృతిమించుతున్నాయి. ప్రత్యర్ధులుగా కాకుండా శత్రువుల్లాగా ఇరు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూపులో పార్టీ తరపున కాకుండా వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తున్నారు. పార్టీ పరంగా ఏమైనా ఉంటే మనం మనం చూసుకుందామని కుటుంబంలోని స్త్రీలను ఇందులోకి లాగ వద్దని ఇటీవల బిఏసి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, టిడిపి నేత అచ్చన్నయుడు ఒప్పందానికి వచ్చారు. కానీ పోస్టులు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉండటం పై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఓ ఫామ్ హౌస్ ఉంది. దాన్ని బ్రాహ్మణి రూ. 1600 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయమై చర్చ జరుగుతోంది. పెద్దగా డబ్బులు లేకపోయినప్పటికీ, రూ.1600 కోట్లు పెట్టి దివంగత సీఎం జయలలిత ఫామ్ హౌస్ కొన్న నిరుపేద నారా బ్రాహ్మణి అంటూ కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా బ్రాహ్మణి పై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టిడిపి అంటుంది.
Advertisement
ఇదంతా తప్పుడు ప్రచారమని ఫ్యాక్ట్ చెక్ టిడిపి అనే ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ను టిడిపి అధికారిక ఖాతా ద్వారా రీ ట్వీట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. జయలలితకు హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ దగ్గర్లో ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉందట. 25 ఎకరాల వరకు ఉండే ఆ ఫామ్ హౌస్ కు జేజే గార్డెన్ అనే పేరు ఉందట. కానీ ఇటీవల ఆ పేరు మారిపోయిందని చెబుతున్నారు. మరో కంపెనీకి చెందిన ఆస్తిగా ఆ ఫామ్ హౌస్ దగ్గర ఓ బోర్డును ఏర్పాటు చేశారట. అందుకే ఇప్పుడు చర్చ జరుగుతోంది అంటున్నారు. ఆ కంపెనీ ప్రతినిధులు బ్రాహ్మణికి తెలిసిన వారిని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని టిడిపి ఖండించింది.
READ ALSO : అన్న బాటలో తమ్ముడు..మునుగోడు ప్రచారానికి దూరం రాజగోపాల్ రెడ్డి !