Advertisement
లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి ని దర్శించుకోవడానికి బరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్తారు. ఎంతో చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో అయ్యప్ప భక్తులు ఇక్కడకి వెళ్తూ వుంటారు. ఈ మూడు నెలలులో కూడా అయ్యప్ప కి పూజలు ఎక్కువగా చేస్తారు. అయ్యప్ప స్వామికి ఈ మూడు నెలలు ఎక్కువగా మాలలు వేసుకుని.. ఇరుముడి కట్టి కేరళలో ఉన్న శబరి గిరీశుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. దాదాపు 5 వేల అడుగుల ఎత్తులో కొండ ఉంటుంది. కొండ మార్గంలో కొండ ఎక్కి అక్కడకి చేరుకోవాల్సి ఉంటుంది.
Advertisement
కొండ ఎక్కేసాక అయ్యప్ప గుడి ముందు బంగారు మెట్లు ఉంటాయి. అవి ఎక్కుతూ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. ఈ 18 మెట్లకు చాలా ప్రాముఖ్యత వుంది. ఇక్కడకి చేరే అవకాశం అందరికీ రాదు. ఎంతో పుణ్యం చేసుకోవాలి ఇక్కడకి వెళ్లాలంటే. ఈ మెట్లు ఎక్కితే మనలో ఉండే చెడు గుణాలు అన్నీ కూడా పోతాయట. ఈ 18 మెట్లను పరశురాముడు కట్టించారట. పంచ భూతాలను అలానే మనిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో చూసి వాటిని మెట్లుగా నిర్మించారు.
Advertisement
ఒక్కసారి వీటిని ఎక్కితే జీవితాంతం ఫలం దక్కుతుందట. ఈ మెట్లలో మొదటి ఎనిమిది అష్ట దిక్పాలకులు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరూతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు. ఇక
9, 10 మెట్లు యోగాలు. కర్మ యోగం, జ్ఞాన యోగం. మిగిలినవి విద్య, అవిధ్య, జ్ఞానం అలానే అజ్ఞానం, ఆనందం, ధుఖం, మనశాంతి, మోక్షం. వీటిని ఎక్కితే జీవితం ఆనందమయం అవుతుందట. ఈ మెట్లు ఎక్కి నెయ్యి మరియు కొబ్బరికాయలు నెత్తిన పెట్టుకుని ఆ నెయ్యిని అభిషేకం చేస్తే అంతా మంచే కలుగుతుంది. ఎంతో పుణ్యం వస్తుంది.
Also read: