Advertisement
పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి కూడా భర్తతో కలిసి ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ ఏదో ఒక ఇబ్బంది రావడం తో భార్యాభర్తలు విడిపోవడం లేదంటే ప్రాణాలనే తీసుకోవడం ఇటువంటివి ఎన్నో చూస్తున్నాము. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది ఇక వివరాలను చూసేద్దాం. కృష్ణాజిల్లాలోని నూజివీడులో ఇది చోటుచేసుకుంది
Advertisement
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన గద్దల వెంకటేశ్వరరావుతో శిరీషకి పెళ్లి అయింది. 2018 లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. మొదట్లో అంతా బాగానే ఉంది కానీ రాను రాను తన మీద అనుమానం పెంచుకున్నాడు భర్త. పాప కూడా వీళ్ళకి పుట్టింది. 2019లో సచివాలయంలో ఈమెకి ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె మీద అనుమానంతో భర్త వేధిస్తుండడంతో పలుమార్లు గొడవలు అయ్యాయి. పెద్దలు నచ్చ చెప్పారు.
Advertisement
మూడు రోజుల క్రితం ఆమె మీద దాడి చేశాడు. తల మీద కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి దీంతో ఆమె పుట్టింటికి వచ్చింది. పాపని తీసుకురమ్మని అన్నని పంపించింది భర్త ఇవ్వనని చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురై నాలుగు పేజీల ఆ%%త్య లేఖ రాసేసి ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలు, చిన్న అత్తలు ఆమె చావుకి కారణమని లెటర్ లో ఆమె పేర్కొంది. పోలీసులకి సమాచారాన్ని అందించారు. సూ$$డ్ లేఖ, కంప్లైంట్ ఆధారంగా పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read: