Advertisement
ఆమె కళ్లు వెండితెరపై వెలుగులు చిమ్మాయి. ఆమె చిరునవ్వు చిత్రసీమలో వెన్నెల పూయించింది. ఆమె హొయలు నెమలి కుళ్లుకునేలా చేసింది. ఆమె మాట ఓ వీణలా మార్మోగింది. తెలుగుదనానికి నిండైన రూపం. అసమాన నటనకు నిదర్శనం. తారలెందరొచ్చినా మహానటి సావిత్రిని మైమరపించడం సాధ్యం కాని పని. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సావిత్రి తన చివరి రోజుల్లో ఎలా బతికిందో కొందరికే తెలుసు. మహానటి సినిమాలో చూసింది కూడా కొంతే.
Advertisement
Also Read: షూలు చేతపట్టుకుని వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ
తాజాగా సీనియర్ నటి తులసి.. సావిత్రి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. “సావిత్రితో మా అమ్మగారికి మంచి స్నేహం ఉండేది. ఆమె సూచన వల్లే నేను సినిమాలకి పరిచయం అయ్యాను. చివరి రోజుల్లో సావిత్రి చిన్న ఇంట్లో ఉండటం నిజమే. ఆ ఇంటి రోడ్డుకి ఇవతల మా ఇల్లు ఉండేది. సావిత్రి చివరి రోజుల్లో పడిన కష్టాలను చూస్తే.. ఈ కళ్లే వద్దు అని అనిపించింది’’ అని చెప్పింది తులసి.
Advertisement
అంతేకాదు.. మరికొన్ని విషయాలను కూడా పంచుకుంది. ‘‘సావిత్రి చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. ఒక మనిషి చనిపోతే ఇంతమంది వస్తారా? అనే ఆశ్చర్యం అప్పట్లో అందరిలో ఉండేది. సావిత్రి ఎన్నో దానాలు చేశారు. ఆమెకి అలాంటి పరిస్థితి రావడం ఏంటి? అని అంతా అనుకుంటారు. కానీ, ఆమె దగ్గర నటించి దానాన్ని పొందినవారే ఎక్కువ’’ అని ఆనాటి విషయాలను వివరించింది.
సావిత్రిని చూసిన చాలామంది తమ జీవితంలో డబ్బు విషయంలో జాగ్రత్త పడ్డారని… చివరి రోజులను దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్లారని చెప్పింది తులసి. అలా కూడా ఆ తల్లి అందరికీ మంచే చేసిందని.. ‘‘ఆమె జీవితం ఓ పుస్తకం. ఆమె నుంచి నేను అందుకున్న ఆశీస్సుల ముందు ఏ అవార్డులు పనికి రావు’’ అని తెలిపింది.