Advertisement
నందమూరి కుటుంబంలో ఎన్నో విషాదాలు.. పదకొండు మంది ఎలా చనిపోయారంటే?
తెలుగు వారికి అత్యంత ప్రియమైన నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ గారు జనవరి 18 , 1996 లో మరణించారు. ఇప్పటికి ఆయన మరణించి 27 సంవత్సరాలు అవుతున్నా.. ఆయనకు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం అలా కొనసాగుతూనే ఉంది. సినిమాల ద్వారా, రాజకీయాల ద్వారా ప్రజలకు చేరువైన నందమూరి కుటుంబంలో చాలా విషాదాలు ఉన్నాయి. వివిధ కారణాల వలన నందమూరి కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. వారెవరో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
Advertisement
నందమూరి కుటుంబంలో విషాదం అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఆగష్టు నెల, రోడ్డు ప్రమాదాలు. 2009 లో జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్.. ఆ తరువాత జానకి రామ్, హరికృష్ణ గారికి కూడా యాక్సిడెంట్లు అయ్యాయి. ఎన్టీఆర్ గారి తండ్రి లక్ష్మయ్య చౌదరి గారు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ లో రెండు వేల ఎకరాలను కొనుగోలు చేసారు. ఆ పొలాన్ని చూసుకుని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో లక్ష్మయ్య గారు చనిపోయారు. ఆ పొలాన్ని చూసి వస్తుంటేనే ఆయన చనిపోయారు అని భావించిన ఎన్టీఆర్ గారు ఆ పొలాన్ని అమ్మేసి.. ఆ డబ్బుని కూడా ఇంటికి రానివ్వలేదు. నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య గారితోనే మొదలయ్యాయని చెప్పొచ్చు.
ఆ తరువాత మరో విషాదం ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం. అనారోగ్య కారణాలతో ఈయన మరణించాడు. ఎన్టీఆర్ ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పెద్ద కొడుకు మరణంతో ఎన్టీఆర్ తల్లడిల్లిపోయారు. ఆయనపై ఉన్న ప్రేమతో రామకృష్ణ స్టూడియోస్ ను స్థాపించి అందులో చాలా మంచి సినిమాలనే నిర్మించారు. ఆయనకు మరింత దురదృష్టకరమైన సంవత్సరం 1985 అనే చెప్పాలి. ఆ సంవత్సరం ఆయనకు ఎంతో ప్రాణమైన బసవతారకం గారు కాన్సర్ కారణంగా మృత్యువాత పడ్డారు.
Advertisement
అప్పటికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గారు ఆమె మరణంతో ఒక్కసారిగా ఒంటరి అయిపోయారు. ఆయన భార్యపై ఉన్న ప్రేమకి గుర్తుగా.. ఆవిడ పడిన బాధ మరొకరు పడకూడదు అని బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ని స్థాపించారు. ఈ హాస్పిటల్ కి ప్రస్తుతం బాలయ్య బాబు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ హాస్పిటల్ ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడింది నందమూరి కుటుంబం.
పార్టీ తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్. తన జ్ఞాపకాలను తెలుగు వారికి మిగిల్చి.. ఈలోకాన్ని వదిలి వెళ్లారు ఎన్టీఆర్ గారు. ఆయన మరణం నందమూరి కుటుంబంలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రానికే తీవ్ర విషాదం. గుండెపోటుతో మరణించిన ఎన్టీఆర్ గారు తన చివరి రోజుల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన మరణం తరువాత జరిగిన మరో విషాదం ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు గారి మరణం. రామలక్ష్మణుల్లా మెలిగే ఈ అన్నదమ్ములు ఒకరితరువాత ఒకరు ఈ లోకాన్ని వీడారు. త్రివిక్రమ రావుకు ఇద్దరు కుమారులు. కళ్యాణ్ చక్రవర్తి మరియు హరిన్ చక్రవర్తి. హరిన్ చక్రవర్తి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో త్రివిక్రమ రావు గారి ఆరోగ్యం క్షీణించింది. ఆయన కూడా ఈ లోకాన్ని వీడారు. తండ్రిని, తమ్ముడిని పోగుట్టుకోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు దూరం అయ్యారు. ఎన్టీఆర్ గారి రెండవ కుమారుడు జయకృష్ణ కుమార్తె కుముదిని గారు కూడా ఈ లోకాన్ని వీడారు. ఈమెను ఎల్బీ ప్రసాద్ గారి మనవడికి ఇచ్చి వివాహం చేసారు ఆమె కూడా అనుకోని కారణాలతో మృతి చెందారు. ఇక నందమూరి తారక రామారావు గారి కుమారుడు హరి కృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయి తీరని విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.