Advertisement
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి ఒకే సినిమాలో కనపడ్డారు. దీంతో మెగా ఫ్యాన్స్ అందరు పండగ చేసుకుంటున్నారు. బ్రో సినిమా రిలీజ్ అయిన మొదటి నుండి కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాకి అదిరే రెస్పాన్స్ వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ విషయం మాట్లాడినా కూడా తిప్పితిప్పి అందరూ కూడా ఆయన మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడుతున్నారు. పైగా ప్యాకేజీ స్టార్ అని కూడా అంటున్నారు. దత్తపుత్రుడు అని కూడా పిలుస్తున్నారు. వీకెండ్ స్టార్ అని కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు.
Advertisement
పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ని ఏమన్నా ఊరుకోరు ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ ని ఎన్ని మాటలు అన్నా కూడా మెగా హీరోలు ఎందుకు సైలెంట్ గా ఉంటారు అనే విషయాన్ని సాయిధరమ్ తేజ్ చెప్పారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాలిటిక్స్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ మా మామయ్యని అంటే మాత్రం చాలా బాధగా ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లేటప్పుడు వరుణ్, చరణ్, వైష్ణవ్ ని, నన్ను పిలిచి పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను.
Advertisement
పాలిటిక్స్ లోకి వెళ్తే నా మీద చాలా విమర్శలు వస్తాయి. నీచంగా మాట్లాడుతారు. మీరు రియాక్ట్ అవ్వద్దు అని పవన్ కళ్యాణ్ ముందే చెప్పారట. అలానే రియాక్ట్ అవ్వాలంటే ముందు మీరు రండి. పూర్తిగా విషయం తెలుసుకోండి అని చెప్పారట. స్టడీ చేయడానికి పాలిటిక్స్ లోకి వచ్చి తర్వాత మాట్లాడండి అని చెప్పడంతో.. మేము మాట్లాడమని తేజ్ చెప్పారు. పైగా మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది దానిని మీరు నిరూపించుకోక్కర్లేదని కూడా పవన్ కళ్యాణ్ ముందే చెప్పారట.
Also read:
- ఈ 4 లక్షణాలు ఉన్న భార్య వచ్చిందంటే.. భర్త లైఫ్ నాశనమే..!
- లైవ్ మ్యాచ్ లో పాము కలకలం.. షాక్ లో ప్లేయర్లు..!
- చిన్న వయసులో భర్తలను కోల్పోయిన నటీమణులు..!