Advertisement
Saindhav Movie Telugu Review: శైలేష్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సినిమా “సైంధవ్”. ఈ సినిమాలో వెంకటేష్ ఓ చేదు గతం ఉన్న వ్యక్తిగా, కూతురుని రక్షించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న తండ్రిగా నటించారు. ఎన్నో అంచనాలతో.. సంక్రాంతి పండుగ సందర్భంగా సైంధవ్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ మామ మూవీకి ఎప్పుడు వంకలు ఉండవు. ఆయనకీ హేటర్స్ కూడా చాలా తక్కువ. మరి ఈ సినిమా కూడా అందరికి నచ్చుతుందా? లేదా? రివ్యూ ఎలా ఉందొ ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
కాస్ట్ & క్రూ:
నటీనటులు
వెంకటేశ్
శ్రద్దా శ్రీనాథ్
రుహానీ శర్మ – డా. రేణు
ఆండ్రియా జెర్మియా
ఆర్య – మానస్
నవాజుద్దీన్ సిద్దిఖీ – వికాస్ మాలిక్
జయప్రకాశ్
బేబీ సారా – గాయత్రి
క్రూ:
దర్శకత్వం: శైలేష్ కొలను
రచన: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయినపల్లి
సంగీతం సంతోష్ నారాయణన్
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్
Advertisement
Saindhav Storyస్టోరీ:
సైంధవ్ కోనేరు (వెంకటేష్)కి చేదు గతం ఉంటుంది. సైంధవ్ కు తన కూతురిని తప్పక రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆమెకు 17 కోట్లు ఖర్చు చేసే ఇంజెక్షన్ అవసరం అవుతుంది. అయితే.. అంత మొత్తంలో డబ్బు సంపాదించడానికి అతను తానూ గతంలో చేసే పనులను చేస్తుంటాడు. ఆ డబ్బుని ఎలా సంపాదిస్తాడు? తన కూతురుని ఎలా రక్షించుకుంటాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Saindhav Review రివ్యూ:
17 కోట్ల ఖరీదు చేసే ఇంజక్షన్‌తో ఆడపిల్లను రక్షించే తండ్రి కథే ఈ సినిమా. ఈ నేపధ్యం చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని చుట్టూ తీసిన సన్నివేశాలు కూడా ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ముఖ్యంగా వెంకటేష్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అయితే.. వెంకటేష్ సీరియస్ యాక్టింగ్ ను అంత పవర్ఫుల్ గా చూపేలా దర్శకుడి స్క్రీన్ ప్లే కనిపించదు. కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపించేస్తాయి. సన్నివేశాలు గట్టి పంచ్ ని ఇవ్వవు. కొంత వరకు ఎక్స్పెక్ట్ చేసిన వారికి ఈ సినిమా డిజప్పోయింట్ ని మిగులుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
వెంకటేష్ నటన
మైనస్ పాయింట్స్:
పేలవ సన్నివేశాలు
రేటింగ్:
2 /5
Wish your friends and relatives with Sankranti wishes in Telugu 2024