Advertisement
Salim Baig: పాండా బాయ్ ఈ పేరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ పేరుతో ఘర్షణ సినిమాలో విలన్ క్యారెక్టర్ (Salim Baig) ఉంటుంది. ఘర్షణ సినిమా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో పాండా బాయ్ పాత్రలో నటించిన నటుడు కూడా అందరికీ ఇప్పుడు కూడా గుర్తుండే ఉంటారు. దాదాపు ఈ సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయిపోయినా కూడా ఎవరూ కూడా పాండా బాయ్ అని ఇంకా మర్చిపోలేదు. 2004లో ఘర్షణ సినిమాలో పాండా బాయ్ పేరుతో మొట్టమొదట ఫుల్ లెన్త్ విలన్ రోల్ లో కనిపించాడు. అయితే ఇతని పేరు సలీం మొట్టమొదట 2004లో జై సినిమాలో కనబడ్డాడు. కొన్నాళ్లపాటు తెలుగు సినిమాల్లో నటించాడు.
Advertisement
ఆ తర్వాత తమిళంలో కూడా అవకాశాలు బాగా వచ్చాయి. దీంతో తమిళ సినిమాలు చేశాడు ఇటీవల కాలంలో హిందీ సినిమాల్లో కనబడుతున్నాడు చాలా గొప్ప నటుడు కాకపోయినా అందరికీ మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో అలా కొనసాగుతూ ఉంటాడు అనుకుంటే ఈ మధ్యకాలంలో ఇతను ఎక్కడా కనిపించట్లేదు. చివరగా నటించిన సినిమా ఆరడుగుల బుల్లెట్. గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమాలో ఒక చిన్న రోల్ చేశాడు. తర్వాత ఎక్కడా కూడా కనిపించలేదు. హిందీలో పాపులర్ అవ్వాలని అక్కడ అవకాశాల కోసం చూస్తున్నాడు. ఘర్షణ (Venkatesh) సినిమా 20 ఏళ్ల కిందట వచ్చింది.
Advertisement
Also read:
- Chiranjeevi: సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసు వల్లే చిరంజీవి అంతటి స్టార్ హీరో అయ్యారా ! కృష్ణ చేసిన త్యాగం ఏంటంటే..?
- Best husband qualities: భార్య భర్తలో కోరుకునే 5 లక్షణాలు ఇవేనట ! 2వ ది చాలా ముఖ్యం..!
- Renu Desai : రేణు దేశాయి రెండో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది..?
అప్పుడు చాలా యంగ్ గా ఉన్నాడు సలీం ఇప్పుడు అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ఇతను అతనేనా అని చాలామందికి సందేహం కూడా వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు రావాలని ట్రై చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ తో ఇటీవల ఓ మూవీలో నటించాడు. దానికంటే ముందు గన్స్ ఆఫ్ బెనారస్ సినిమాలో కూడా కనిపించాడు. సల్మాన్ ఖాన్ తరచుగా ఇతనికి అవకాశాలు ఇస్తున్నాడు. బాడీగార్డ్ మూవీ లో కూడా నటించాడు. రఘువరన్ లాగ ఒక స్టార్ విలన్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ అంత పేరు తెచ్చుకోలేకపోయాడు ఘర్షణ మూవీలో అయితే అతని వాయిస్ లో గౌతం మీనన్ గొంతు అద్భుతంగా పండింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!