Advertisement
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఏ మాయ చేసావే చిత్రం నుంచి.. తాజాగా విడుదలైన యశోద చిత్రం వరకు.. దాదాపు దశాబ్దం పైన గడుస్తున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే, సమంత ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు పూర్తయింది. మొదటి సినిమాతో సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
Advertisement
సమంత నటించిన ఏ మాయ చేసావే సినిమాకు ఆమెకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో సమంత భారీగానే ఆస్తులు కూడా పెట్టింది. సమంత ప్రస్తుతం లగ్జరీ లైఫ్ అనుభవిస్తోంది. సమంత రూతు ప్రభుకు భారీ పెంట్ హౌస్ బేస్ లగ్జరీ హోమ్ ఉంది. నటి హైదరాబాదులోని ఒక ఉన్నత ప్రాంతంలో విలాసవంతమైన ఈ బంగ్లాలో ఉంటుంది. తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి ప్రముఖ నటుడు మురళీమోహన్ నుండి ఈ ఇంటిని కొనుగోలు చేసింది.
Advertisement
అయితే నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత ఇంటిని అదే నటుడికి విక్రయించినట్లు సమాచారం. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ క్లారిటీ ఇచ్చాడు. సమంత తన కోసమే ఆ ఇంటిని కొనుక్కుని ప్రస్తుతం అందులో నివసిస్తోందని తెలిపారు. ఈ బంగ్లా ఖరీదు కోటి రూపాయలు. సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. తన స్నేహితులతో కలిసి రెండు, మూడు వ్యాపారాలు చేస్తోంది.
వారికి ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనే ప్లే స్కూల్ ఉంది. సాకీ దుస్తుల బ్రాండ్ ను కూడా శ్యామ్ నడుపుతోంది. నటి ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ సాకీకి చాలా ఇన్పుట్ ఇస్తుంది. వ్యాపారాలతో పాటు చారిటీ ఫౌండేషన్ కూడా నడుపుతోంది. ఈ ఫౌండేషన్ ద్వారా వారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల చికిత్స మరియు శస్త్రచికిత్సలకు నిధులు సమకూరుస్తున్నారు. సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ తో పాటు, బాలీవుడ్ లో కూడా సమంతకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు హాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. పలు నివేదికల ఆధారంగా 2022 వరకు నటి నికర విలువ రూ. 97 కోట్లు అని సమాచారం. సమంత వార్షిక ఆదాయం ప్రకారం ఆమె నెలకు 8 కోట్లు సంపాదిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో పెయిడ్ పార్ట్నర్ షిప్ పోస్ట్ కోసం సమంత దాదాపు రూ. 10 లక్షల – 20 లక్షలు చార్జ్ చేస్తుంది. ఆమె టీవీ ప్రకటనల కోసం దాదాపు రూ. 3-5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
Read also: ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?