Advertisement
నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తోంది సమంత. దూకుడుగా సినిమాలు చేస్తూ కమిటైన అన్ని మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేస్తోంది. డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. మయోసైటిస్ అనే వ్యాధికి గురై కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకున్న సమంత తిరిగి ఇప్పుడు యాక్టివ్ అయింది.
Advertisement
READ ALSO : ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని టాలీవుడ్ సెలెబ్రెటీల 25 +పెళ్లి ఫోటోలు !
ఇక సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శాకుంతలం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్ లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికర వాక్యాలు చేశారు.
Advertisement
ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంతుని పాత్రలో నటిస్తున్నారు. సమంత మాట్లాడుతూ… ‘చిన్నప్పుడు ఈ కథ నాకు కొంత తెలుసు. నా ప్రతి సినిమాకు ది బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తా. ఫస్ట్ నేను నా క్యారెక్టర్ చేయడానికి భయపడ్డా. నాకు అన్నీ ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్న, కానీ క్లిష్ట సమయంలోనే నేను చాలా స్ట్రాంగ్ గా తయారయ్యా. అర్హ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు అందరి ముఖాల్లో నవ్వు కనబడుతోంది. పాన్ ఇండియా సినిమాకు ఉన్న బెస్ట్ కోసం ఎంతో కృషి చేశా’ అని అన్నారు.
READ ALSO : పవన్ ఫాన్స్ ని భలే మోసం చేసారు గా…! ఇలా కూడా చేస్తారా ? డైరెక్టర్ సాబ్ !