Advertisement
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా, స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ లవ్ డ్రామా మూవీ ఖుషి ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలై పాజిటివ్ టాక్ తో సక్సెస్ దిశగా దూసుకుపోతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రానికి గాను హేషం అబ్దుల్ సంగీతం సారథ్యం వహించారు .
Advertisement
ఇక ఖుషి సినిమా విడుదలైన దగ్గర నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక సోషల్ మీడియాలో వివాదాస్పదంగా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో సమంత నటించిన బెడ్ రూమ్ సీన్స్ పై అసలు నువ్వు ఎలా ఇలాంటి సీన్స్ చేస్తావు అంటూ నాగచైతన్యయ అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం సమంత నటించిన ఖుషి మూవీలో సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత నటించిన ఈ సన్నివేశాలపై కొంతమంది నెగటివ్ గా రియాక్ట్ అవుతుంటే మరికొందరు పాజిటివ్‌గా సమంతకు సపోర్ట్ చేస్తున్నారు. కొందరు నీకు దండం పెడతాను సమంత.. దయచేసి సినిమాలు చేయడం ఆపే అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు . ఇక మరికొందరు సమంతకు విడాకులు అయిపోయాక తన లైఫ్ తను లీడ్ చేసుకుంటోంది. ఇంకా ఆమెను అక్కినేని కోడలా చూడటంలో ఎలాంటి అర్ధం లేదు.
Advertisement
ఆమె ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి సీన్లు చేయకూడదు వంటివి కొంత మంది డిసైడ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఓ సినిమాలో ఇలాంటి సన్నివేశాలలో నటించాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగతం విషయం. చైతన్య థాంక్యూ మూవీలో రాశి ఖన్నాతో కలిసి లిప్ లాక్ సీన్లు చేసినప్పుడు ఫ్యాన్స్ ఎందుకు అంతలా ఫీల్ అవ్వలేదు..? చైతూకి ఒక రూల్, సామ్ కి ఒక రూల్ పెట్టడం కరెక్టయినా పద్ధతి కాదు. చైతన్య రొమాంటిక్ సీన్లలో నటించినప్పుడు మాట్లాడని వారు, ఇప్పుడు సమంతా విషయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ నిలదీస్తున్నారు.
Also Read :
ఖుషి సినిమాలో సమంత లుక్స్ పై దారుణంగా ట్రోలింగ్.. అందుకోసమేనా ?
చిరంజీవి ప్లాప్స్ తో విసిగిపోయిన ఒక అభిమాని ఆవేదన..!
“ఖుషి” సినిమా నుంచి నాగ చైతన్య కి సమంత ఇచ్చిన ఈ మెసేజ్ కనిపెట్టారా.. ?